ETV Bharat / state

కరోనాపై అవగాహన కలిగిస్తుండగా దాడి.. వాలంటీర్ మృతి - విజయనగరం జిల్లాలో వలంటీర్ పై దాడి

విజయనగరం జిల్లా కందిరివలస గ్రామంలో వార్డు వాలంటీర్ గా పనిచేస్తున్న లక్ష్మణరావుపై అదే ఊరికి చెందినవారు దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన లక్ష్మణరావు చికిత్స పొందుతూ చనిపోయారు.

Attack on volunteer in vizayanagaram
Attack on volunteer in vizayanagaram
author img

By

Published : Apr 29, 2020, 7:55 PM IST

Updated : Apr 29, 2020, 8:17 PM IST

విజయనగరం జిల్లా కందిరివలస గ్రామంలో వార్డు వాలంటీర్ ను స్థానికులు దాడి చేసి హతమార్చారు. పోలీసుల కథనం ప్రకారం... గ్రామానికి చెందిన కోన లక్ష్మణరావు(25) వాలంటీర్ గా పని చేసేవారు. విధుల్లో భాగంగా.. గ్రామంలోని ప్రజలకు కోవిడ్-19 ప్రభావంపై అవగాహన కల్పించేవారు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన చిన్నారావ్, అతని తండ్రి సన్యాసి.. ఇద్దరూ లక్ష్మణరావుతో గొడవపడ్డారు.

స్థానికులు సర్ది చెప్పగా.. వివాదం సద్దమణిగింది. అక్కడితో ఆగని చిన్నారావు, అతని కుటుంబీకులు.. ఈ నెల 20న అదును చూసి లక్ష్మణరావుపై దాడి చేశారు. గుండెపై బలమైన గాయం తగిలిన అతడిని సాలూరు ప్రభుత్వ ఆసుపత్రికి.. అక్కడి నుంచి విశాఖకు తరలించారు. చికిత్స పొందుతూ లక్ష్మణరావు చనిపోయారు. కేసు దర్యాప్తులో ఉంది.

ఇవీ చదవండి:

ఏప్రిల్, మే నెల జీతాలు చెల్లించలేం: స్పైస్​జెట్

Last Updated : Apr 29, 2020, 8:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.