ఆసియాలోనే మొదటి సారిగా రిక్షా కార్మికుల కోసం ప్రత్యేకంగా ఒక కాలనీ ఉందని తెలుసా.. ఇదేదో ప్రభుత్వాలు, అధికారులు చొరవ తీసుకొని ఏర్పాటు చేసింది కాదు. కార్మికులే ఏకమై సాధించుకున్నది. ఇదెక్కడో లేదండి.. విజయనగరం జిల్లా చీపురుపల్లిలోనే ఉంది. ఆసియాలోనే మొదటి రిక్షాకాలనీ ఇదే కావడం గమనార్హం.
1986కి ముందు రిక్షా కార్మికులకూ ఇళ్లు నిర్మించాలనే ఆలోచన శోధన స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ పీడీకే రావుకు వచ్చింది. స్థానికులను ఏకం చేసి ఇళ్ల నిర్మాణానికి స్థలమివ్వాలని అప్పటి ప్రభుత్వాన్ని కోరడంతో మంజూరు చేశారు. కార్మికులు శ్రమదానం చేసి ఆ ప్రాంత రూపురేఖలు మార్చుకున్నారు.
నిధులు మంజూరు కావడంతో 1986-87 మధ్య నిర్మాణ పనులు చేపట్టారు. ఇప్పుడా కాలనీ పట్టణంలోనే ప్రధాన ప్రాంతంగా మారిపోయింది. ఆసియాలోనే రిక్షా కార్మికుల కోసం ఏర్పాటైన మొదటి నివాస సముదాయం ఇదేనని ఒడిశాలోని సెయింట్ జేవీఆర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రూరల్ స్టడీస్ ప్రకటించింది.
ఇదీ చదవండి: గిరిజన విశ్వవిద్యాలయ ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించిన కేంద్ర బృందం