ETV Bharat / state

'ఎవరు ఏ కుటుంబంలో ఉండాలన్నది ప్రభుత్వం చెబితే ఎలా?' - ఏపీ ప్రభుత్వంపై అశోక్ గజపతి రాజు కామెంట్స్

మాన్సాస్ విషయంలో చట్టానికి, కోర్టులకు, ఆనవాయితీకి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు విమర్శించారు. నోటీసులు లేకుండా ఉన్న ఫళంగా ఛైర్మన్ పదవి నుంచి తొలగించడం అన్యాయమన్నారు. మాన్సాస్ ట్రస్ట్ ఛైర్ పర్సన్ సంచయిత సామాజిక మాధ్యమాల్లో చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు.

Ashokgajapathi raju
Ashokgajapathi raju
author img

By

Published : Nov 17, 2020, 4:32 PM IST

అశోక్ గజపతి రాజు

మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారం గజపతిరాజుల కుటుంబంలో వివాదాలకు దారితీస్తోంది. మాన్సాస్ ట్రస్ట్ ఛైర్ పర్సస్ సంచయిత సామాజిక మాధ్యమంలో చేసిన పోస్టుపై తెదేపా నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సంచయిత వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. సామాజిక మాధ్యమాల్లో సంచయిత పెట్టిన పోస్టులే ఆమె వ్యక్తిత్వాన్ని చెబుతాయని వ్యాఖ్యానించారు.

"ఎవరో పెట్టిన పోస్టులకు నేను సమాధానం చెప్పడం నా ఖర్మ. తాత ఎవరో, తండ్రి ఎవరో తెలియదు. తండ్రి, తాతను సంచయిత ఒక్కసారైనా కలవలేదు. తమ పూర్వీకులు నిర్వహించే ఆలయాలకు ఒక్కసారి కూడా రానివారు.. వాటి ఆస్తులపై కన్నేయడం బాధాకరం"

-- అశోక్ గజపతిరాజు, కేంద్ర మాజీ మంత్రి

మాన్సాస్ ఛైర్మన్ హోదా ప్రభుత్వం కల్పించిన పదవి కాదని అశోక్ గజపతిరాజు అన్నారు. ట్రస్టు నియామకాల్లో ప్రభుత్వ ధోరణి సరికాదన్నారు. ఆనవాయితీలకు, సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోదని ఆరోపించారు. ఎవరు ఏ కుటుంబంలో ఉండాలన్నదీ ప్రభుత్వం నిర్ణయించే ధోరణి సరికాదన్నారు. ఆదాయం, ఆస్తి ఉన్న ఆలయాలపై ప్రభుత్వం కన్నేయటం బాధాకరమన్నారు. దేవాదాయశాఖ చట్టం రాష్ట్రంలో అమలు కావడం లేదని అశోక్​’గజపతి రాజు విమర్శలు చేశారు.

తెలుగుదేశం ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్నానన్న ఆయన ఏనాడు సిద్ధాంతాలు మార్చి పారిపోలేదన్నారు. తెలుగు వారి గౌరవం కోసం పనిచేశానని చెప్పారు. కొంత మంది ఇవాళో పార్టీ రేపో పార్టీలో ఉంటున్నారని ఎద్దేవా చేశారు.

"ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు... 105 దేవాలయాలకు ఛైర్మన్​గా నియమించారు. ఆలయాల్లో అన్ని క్రతువులు సరిగ్గా జరిగేలా చూసే బాధ్యత అప్పగించారు. ఈ దేవాలయాలను 6 విభాగాలుగా చేసి, దీప, ధూప నైవేద్యాలు క్రమంగా జరగాలని కృషిచేశాను. ఆనవాయితీకి వ్యతిరేకంగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. వారికి ఇష్టమొచ్చిన వారిని మా కుటుంబ సభ్యులుగా ప్రకటిస్తున్నారు. జిల్లా మంత్రి మాన్సాస్ ట్రస్టు వ్యవహరం కుటుంబ సమస్య అంటారు. ఆలయాలు మా సొంతవి కావు. ఇది ప్రజల ఆస్తులు. నేను మనవి చేస్తున్నా...ఇది కుటుంబ వివాదంకాదు. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరికాదు."

---అశోక్ గజపతిరాజు, కేంద్ర మాజీ మంత్రి

ప్రభుత్వంలోని పెద్దలు, మంత్రులు కొవిడ్ నిబంధనలను ఉల్లంఘించి భారీ బహిరంగ సమావేశాలు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా నిబంధనలు వారికి వర్తించవా అని ప్రశ్నించారు. ప్రతిపక్షాలు ఆందోళన చేస్తే కొవిడ్ నిబంధనలు పేరుతో అరెస్టులు చేస్తున్నారని ఆరోపించారు. స్థానిక ఎన్నికలు నిర్వహించాలని ఈసీ ప్రతిపాదించనప్పటికీ... కొవిడ్ సాకు చూపుతూ ఎన్నికలు నిర్వహించడంలేదన్నారు.

ఇదీ చదవండి : శారదా పీఠాధిపతికి ఆలయ మర్యాదలు కోరుతూ రాసిన లేఖ ఉపసంహరణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.