పంచాయతీ ఎన్నికలపై సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగ ఔన్నత్యాన్ని కాపాడిందంటూ తెదేపా నేత అశోక్ గజపతి రాజు వ్యాఖ్యానించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా విజయనగరం జిల్లా తెదేపా కార్యాలయంలో అంబేడ్కర్ చిత్రపటానికి పాలాభిషేం చేశారు. ఎంత మంచి రాజ్యాంగమైనా...చెడ్డవారి వారి చేతిలో పెడితే..చెడ్డదిగానే తయారవుతుందని అంబేడ్కర్ ఆనాడే చెప్పాడని గుర్తు చేశారు.
దేశంలో రాజ్యాంగంపై ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చిన ప్రజాప్రతినిధులు..రాజ్యాంగాన్ని కించపరిచేలా మాట్లాడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో అధికార పార్టీ నేతల మాటలు ప్రజలను రెచ్చగొట్టే విధంగా ఉంటున్నాయని ఆక్షేపించారు.
ఇదీచదవండి: అధికారంలో ఉన్నా.. మా చేతులకు కట్లు వేసుకున్నాం: సజ్జల