governing body of ramatheertham temple: రామతీర్థం పాలకమండలి ప్రమాణస్వీకారంపై రామతీర్థం ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ అశోక్ గజపతిరాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయ అనువంశిక ధర్మకర్త లేకుండా పాలకమండలి ప్రమాణ స్వీకారం ఎలా చేస్తారని ప్రశ్నించారు. గురువారం నిర్వహించిన కార్యక్రమంలో.. పూర్తిగా నిబంధనలను ఉల్లంఘించారని ఆక్షేపించారు. పాలకమండలితో కలిసి పని చేయాల్సిన తననే పక్కనపెట్టారని మండిపడ్డారు.
"ఎమ్మెల్యే.. ఏ అధికారంతో ప్రమాణస్వీకారం చేయించారు. రాజ్యాంగాన్ని దారుణంగా అవమానిస్తున్నారు. రామతీర్థం ఆలయ ఈవో నిబంధనలు పాటించట్లేదు. ప్రశ్నిస్తే రాజకీయం చేస్తున్నారని బురద జల్లుతున్నారు. రాజ్యాంగబద్ధంగా నడుచుకోవాలని చెప్పడం రాజకీయమా..? ఆలయ వ్యవహారంలో రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. దేవుడి విగ్రహాలకు డబ్బులిస్తే ప్రభుత్వం తీసుకోలేదు. పైగా ఆలయ అభివృద్ధికి రూపాయి ఇవ్వట్లేదని ఆరోపిస్తున్నారు" - అశోక్ గజపతిరాజు, రామతీర్థం ట్రస్టు బోర్డు ఛైర్మన్
ఇదీ చదవండి:
AP Govt To Impose ESMA: ఉద్యోగుల సమ్మెపై 'ఎస్మా' ప్రయోగించే యోచన!