రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందని కేంద్రమాజీ మంత్రి, తెదేపా నేత అశోక్ గజపతి రాజు స్పష్టం చేశారు. పంచాయతీ ఎన్నికలపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును ఆయన స్వాగతించారు. మంచి రాజ్యాంగం చెడ్డవారి చేతిలో పెడితే చెడ్డగానే తయారవుతుందని అంబేడ్కర్ ఆనాడే చెప్పారని హితవు పలికారు. ప్రజాస్వామ్య ఎన్నికలకు వ్యతిరేకంగా వైకాపా ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు సమంజసమైనవి కావన్నారు.
రాష్ట్ర మంత్రులు ఉద్దేశపూర్వకంగానే ప్రవర్తిస్తూ..ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తున్నారని ఆక్షేపించారు. రాజ్యాంగాన్ని పరిరక్షించలేకపోతే పదవుల నుంచి తప్పుకోవాలని సూచించారు.
ఇదీచదవండి
సుప్రీంకోర్టు తీర్పు చారిత్రాత్మకం: హైకోర్టు న్యాయవాది శ్రావణ్‌కుమార్