విజయనగరం జిల్లా పార్వతీపురం మండలం కొత్త ఆడారు గ్రామం వద్ద స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో టాస్క్ఫోర్స్ అధికారులు 10 వేల నాటు సారా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఒడిశాలోని నాగలిబెడ్డ నుంచి పార్వతిపురం వైపు ఆటోలో సారా ప్యాకెట్లు రవాణా చేస్తుండగా అధికారులు గుర్తించారు.
ఆటోను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులను గమనించిన వాహనచోదకులు ముగ్గురు పరారయ్యారు. ఆటోను స్వాధీనం చేసుకుని.. సీజ్ చేసినట్లు టాస్క్ ఫోర్స్ సీఐ జై భీమ్ తెలిపారు. రవాణాదారులు ఎవరనేది త్వరలోనే గుర్తిస్తామని చెప్పారు.
ఇదీ చదవండి: