ETV Bharat / state

ఆంధ్రా అధికారుల నిర్లక్ష్యం.. ఒడిశా అధికారుల చొరవ..

author img

By

Published : Aug 17, 2021, 10:14 PM IST

ఆంధ్రా - ఒడిశా సరిహద్దులోని అటవీ ప్రాంతంలోని గిరిజన గ్రామాలకు రహదారి నిర్మాణానికి ఒడిశా అధికారులు చొరవ చూపారు. ఆ రాష్ట్ర ప్రజా ప్రతినిధులు గిరిజనుల కష్టాలకు చలించి సొంత నిధులతో రహదారి నిర్మాణానికి ముందుకు వచ్చారు. సొంత నిధులతో రహదారి నిర్మాణానికి గిరిజనులు చర్యలు తీసుకోగా ఒడిశా ప్రజాప్రతినిధులు స్పందించారు. ఆర్థిక సహాయాన్ని ప్రకటించి రహదారి నిర్మాణానికి భూమిపూజ చేశారు.

సొంత నిధులకు రహదారి నిర్మించేందుకు సిద్ధమైన ఏవోబీ గ్రామస్తులు

విజయనగరం జిల్లా ఆలూరు మండలంలోని కొదమ పంచాయతీ పరిధిలోని సొంతంగా రహదారి నిర్మాణానికి స్థానికులు ముందడుగు వేశారు. పట్టు చెన్నారు గ్రామం నుంచి కొదమ గ్రామానికి సుమారు 6.7 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇది మొత్తం కాలి నడక మార్గం. ఈ కొండ ప్రాంతంలో రహదారి వేయడం కష్టంతో కూడుకున్న పని. ఈ మార్గంలో కొండపై చోర అనే గ్రామం ఉంది. ఈ ప్రాంతం నుంచి గర్భిణులను, రోగులను మైదాన ప్రాంతానికి తరలించాలంటే ఎన్నో ఇబ్బందులు తప్పడం లేదు. సరైన రహదారి సౌకర్యం లేకపోవడంతో ఈ గ్రామాల్లోని యువకులకు వివాహాలు కూడా జరగడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇంటికి రూ. 5వేల చొప్పున...

కొదమ, చోర గ్రామాల వారు రహదారి నిర్మాణానికి ముందుకు వచ్చారు. చోర గ్రామంలో సుమారు 70 కుటుంబాలు ఉండగా కొదమ పంచాయతీ కేంద్రంలో మరో 130 కుటుంబాల వరకు ఉన్నాయి. వీరంతా ఇంటికి రూ. 5 వేలు చొప్పున అందించేందుకు సిద్ధమయ్యారు.

ఏపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు..

సోమవారం పట్టు చెన్నారు వచ్చిన ఒడిస్సా అధికారులు, ప్రజా ప్రతినిధులు ఈ గ్రామస్థులను కలిశారు. తమను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, రహదారి సౌకర్యం లేక కనీసం గ్రామంలోని యువకులకు వివాహాలు కూడా కావడం లేదని స్థానికులు వారి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. వారి పరిస్థితికి చలించిన ఒడిశా ప్రజాప్రతినిధులు రూ. 5 లక్షలు సొంత నిధులు ఇస్తామని హామీ ఇచ్చారు. అనంతరం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో పట్టు చెన్నారు గ్రామ సమీపంలోని మామిడి చెట్టు కూడలి వద్ద కొబ్బరికాయ కొట్టి రహదారి నిర్మాణానికి పూజలు నిర్వహించారు. ఒడిశా ప్రజాప్రతినిధులతో ఆంధ్ర గ్రామాల యువత కలిసి భూమిపూజలో పాల్గొన్నారు.

ఇదీ చదవండి: Fire Accident: పాఠశాలలో అగ్నిప్రమాదం..విద్యార్థులకు తప్పిన ముప్పు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.