ప్రపంచ దేశాల్లో చమురు ధర తగ్గుతుంటే, మన దేశంలో కేంద్ర ప్రభుత్వం అంతకంతకు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచేస్తుందంటూ విజయనగరంలో ఏఐటీయూసీ నాయకులు ఆరోపించారు. డీజిల్ ధరల పెంపుని నిరసిస్తూ ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్రోల్, డీజిల్ రేట్లు అమాంతంగా పెరిగాయని ఏఐటీయూసీ నాయకులు బుగత అశోక్ అన్నారు. కరోనా వైరస్ వంటి కష్టకాలంలో కూడా చమురు ధరలు పెంచి ప్రజలపై భారం మోపుతున్నారని వాపోయారు. తక్షణమే కేంద్రం చమురు ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి : ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా