ప్రభుత్వం లైసెన్స్ ఇచ్చిన ఎరువుల దుకాణాల్లో మాత్రమే రైతులు కొనుగోలు చేయాలని సాలూరు వ్యవసాయ సహాయ సంచాలకులు మధుసూదన రావు తెలిపారు. విజయనగరం జిల్లా పలు ఎరువుల దుకాణాల్లో తనిఖీలు చేపట్టిన ఆయన ప్రభుత్వం లైసెన్స్ ఇచ్చిన దుకాణాల్లో మాత్రమే ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు కొనుగోలు చేసి బిల్లులు పొందాలన్నారు. అనంతరం కురుపాం మండలంలోని పూతికవలస గ్రామం వద్ద ఓ ఎరువుల దుకాణంలో కంపెనీకి చెందిన సరైన పత్రాలు లేకపోవడం వల్ల రూ 4.44 లక్షల విలువగల ఎరువుల అమ్మకాలు నిలిపివేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఈ తనిఖీల్లో మండల వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి...: పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలంటూ సాలూరులో ఆందోళన