గంజాయి కేసులో అదుపులోకి తీసుకున్న దేవేందర్ ఖిల్లో అనే వ్యక్తి.. పారిపోయాడని పోలీసులు తెలిపారు. విజయనగరం జిల్లా సాలూరు వద్ద పోలీసులు నిన్న అతడిని అదుపులోకి తీసుకున్నారు.
పట్టుకునే సమయంలో స్వల్ప గాయాలు కావడంతో దేవేందర్‌ను ఆస్పత్రికి తరలించారు. నిందితుడికి చికిత్స అందిస్తుండగా.. ఈరోజు తప్పించుకుని వెళ్లిపోయాడని పోలీసులు వెల్లడించారు. అతడి ఆచూకీ కోసం గాలిస్తున్నామన్నారు.
ఇదీ చదవండి: వ్యాక్సినేషన్‌తో ఎలాంటి సమస్యలు లేవు: ఆరోగ్యశాఖ డైరెక్టర్