విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం కాపు సోంపురం గ్రామంలో విద్యుత్ వైర్లకు తగులుతున్న చెట్టు కొమ్మలను తొలగించేందుకు జూనియర్ లైన్మెన్ హరీష్ చెట్టుఎక్కాడు. సహచర విద్యుత్ ఉద్యోగులతో కలిసి చెట్టుకొమ్మ తొలగిస్తుండగా పట్టు తప్పి కింద పడ్డాడు. ఈ ప్రమాదంలో హరీష్ కాళ్లకు తీవ్రగాయాలయ్యాయి. అతడిని ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం కేజీహెచ్‌కు తరలించాలని స్థానిక వైద్యులు సూచించారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో ఆర్టీసీ బస్సు సర్వీసులు ప్రారంభం