ETV Bharat / state

గిరిజన వర్సిటీ నిర్మాణ స్థలం మార్పుపై ఏబీవీపీ ధర్నా - విజయనగరం జిల్లాలో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు

కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయ నిర్మాణ ప్రాంతం మార్పుపై ఏబీవీపీ విజయనగరంలో నిరసన చేపట్టింది. విజయనగరం జిల్లా కొత్తవలస మండలం రెల్లి గ్రామంలో విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటుచేయాలని గత ప్రభుత్వం నిర్ణయించిందని విద్యార్థి నాయకులు అన్నారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం పాచిపెంట మండలం దుగ్గసారానికి విశ్వవిద్యాలయాన్ని తరలిస్తున్నారని ఆరోపించారు. అన్ని సౌకర్యాలు ఉన్న రెల్లి గ్రామంలోనే యూనివర్సిటీని నిర్మించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాజకీయ, విద్యార్థి సంఘాలను కలుపుకుని ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.

Abvp protest
Abvp protest
author img

By

Published : Oct 23, 2020, 5:25 PM IST

విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేయనున్న కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయ నిర్మాణ ప్రాంతం మార్పును వ్యతిరేకిస్తూ, అఖిల భారత విద్యార్థి పరిషత్(ఏబీవీపీ) నిరసన చేపట్టింది. విజయనగరంలోని కలెక్టరేట్ వద్ద ఏబీవీపీ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో నిర్ణయించినట్లు.. కొత్తవలస మండలం రెల్లి గ్రామంలో ఎంపిక చేసిన స్థలంలోనే గిరిజన విశ్వవిద్యాలయ నిర్మాణాన్ని చేపట్టాలని డిమాండ్ చేశారు. పాచిపెంట మండలం దుగ్గసారం వద్ద విశ్వవిద్యాలయాన్ని నిర్మించాలన్న ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం విరమించుకోవాలని కోరారు.

గిరిజన విశ్వవిద్యాలయ స్థలం విషయంలో రాజులు మారితే..రాజధాని మారినట్లు, విద్యాశాఖ మంత్రి మారితే.. విశ్వవిద్యాలయాలు మారినట్లుగా ఉందని ఏబీవీపీ నాయకులు అన్నారు. విశ్వవిద్యాలయం తరగతులు ప్రారంభించి రెండో ఏడాది కావస్తున్న స్థలం విషయంలో స్పష్టత లేకపోవటం దురదృష్టకరమన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో విద్యార్థులు ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇప్పటికైన రాష్ట్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోవాలని అన్ని విధాలుగా అనుకూలమైన కొత్తవలస మండలం రెల్లి వద్దనే విశ్వవిద్యాలయాన్ని నిర్మించాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో అన్ని రాజకీయ, విద్యార్థి సంఘాలను కలుపుకుని ఉద్యమాన్ని తీవ్ర తరం చేస్తామని హెచ్చరించారు.

ఇదీ చదవండి : 'కరోనా తిరగబెట్టొచ్చు అందుకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించలేం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.