విజయనగరం జిల్లా కొమరాడ మండలం పాలెం పంచాయతీ పరిధిలోని రావికోనలో ఓ వ్యక్తి చింత చెట్టు మీదినుంచి జారిపడి మృతి చెందాడు. గ్రామానికి చెందిన చంద్రబాబు అనే గిరిజనుడు చింతకాయలు కోసుకోవడానికి అడవికి వెళ్లాడు. చెట్టెక్కి కాయలను దులుపుతుండగా.. ప్రమాదవశాత్తు కింద జారిపడ్డాడు.
వెంటనే అతన్ని కురుపాం ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. పరిస్థితి విషమించిన కారణంగా.. చంద్రబాబును పార్వతీపురానికి తరలించారు. అక్కడ వైద్యం అందిస్తుండగా.. మృతి చెందాడు. మృతునికి భార్య పిల్లలు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: