విజయనగరంజిల్లా సీతానగరం మండలం సువర్ణముఖీ నది ప్రవాహం మధ్యలో సింహచలం అనే గొర్రెల(Shepherd) కాపరితోపాటు 130 గొర్రెలు(sheeps) చిక్కుకున్నాయి. అతను మక్కువ మండలం వెంకట బైరిపురాని చెందిన వ్యక్తిగా అధికారులు గుర్తించారు. సింహచలం ఉదయం తన గొర్రెలను మేత కోసం సువర్ణముఖీ(suvarna mukhi rever news) నది ప్రాంతానికి తీసుకువెళ్లాడు. సువర్ణముఖీ నదికి వరదనీరు ఇరువైపులా పోటెత్తడంతో సింహాచలం.. గొర్రెలతో పాటు నది మధ్యలో చిక్కుకున్నాడు.
విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే జోగారావు ఉన్నతధికారులతో మాట్లాడి సహాయక చర్యలు చేపట్టారు. మధ్యాహ్నం 12 గంటల వరకు సింహచలం బిక్కుబిక్కుమంటూ ఓ రాయిపై కూర్చున్నాడు. అధికారులు బాధితున్ని హెలికాప్టర్ సహాయంతో కాపాడారు. నేరుగా అతన్ని విశాఖలోని ఓ ఆస్పత్రికి తరలించి ఆరోగ్య పరీక్షలు చేయించారు.
ఇదీ చదవండి: