ETV Bharat / state

అప్పలరాజుకు 700ఎకరాలు ఉంది... ఆన్​లైన్​లో..! - విజయనగరంలో వ్యక్తికి 700ఎకరాలు ఉన్నట్లు ఆన్​లైన్​లో నమోదు

వడ్రంగి పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు విజయనగరం జిల్లాకు చెందిన అప్పలరాజు. కొన్ని నెలల క్రితం వృద్ధాప్య పింఛను కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఎంతకీ పింఛన్ రాకపోవటంతో... తనకు పింఛను ఎందుకు రావటంలేదని అధికారుల వద్దకు ఆరా తీయటానికి వెళ్లాడు. అతని పేరుమీద ఆన్​లైన్​లో 700ఎకరాలు భూమి ఉందని తెలిసి నిర్ఘాంతపోయాడు. అందుకే పింఛను రాలేదని అధికారులు తెలిపారు.

a man has seven hundred acres on his name noted in online at vizianagaram
అప్పలరాజుకు ఆన్​లైన్​లో 700ఎకరాలు ఉన్నట్లు నమోదు
author img

By

Published : Jun 19, 2020, 8:04 AM IST

విజయనగరం జిల్లా కొత్త భీమసింగి గ్రామానికి చెందిన పట్నాల అప్పలరాజుది(65) నిరుపేద కుటుంబం. వడ్రంగి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. కొన్ని నెలలక్రితం వృద్ధాప్య పింఛను కోసం దరఖాస్తు చేసుకున్నారు. తనకు పింఛను ఎందుకు రాలేదని వాకబు చేసేందుకు అప్పలరాజు గ్రామ సచివాలయానికి వెళ్లారు. ‘మీ పేరిట 700 ఎకరాలు ఉన్నట్లు ఆన్‌లైన్‌ చూపుతోంది. అందుకే పింఛను రాలేదు’ అని అక్కడి సిబ్బంది సమాధానమిచ్చారు.

ఆ మాటలు విని అప్పలరాజు నివ్వెరపోయారు. ఆన్‌లైన్‌లో వచ్చిన తప్పును సరి చేయించుకునేందుకు ఎంపీడీవో, తహసీల్దార్‌ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాడు. దీనిపై తహసీల్దార్‌ భాస్కరరావును వివరణ కోరగా... అప్పలరాజుకు భూమి లేదని నిర్ధరించామన్నారు. ఆ మేరకు ధ్రువపత్రం మంజూరు చేస్తామన్నారు.

ఇదీ చదవండి: ఖరీఫ్​ సాగుకు సిద్ధమవుతున్న రైతులు..

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.