గిట్టుబాటు ధరలు కల్పించాలని పశ్చిమగోదావరి జిల్లాలో కూరగాయల రైతులు రోడ్డెక్కారు. లింగపాలెం మండలం వేములపల్లిలో దొండ రైతులు రహదారిపై ఆందోళన చేపట్టారు. దొండకాయలు రహదారిపై పోసి నిరసన వ్యక్తం చేశారు. కూరగాయల రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలని పెద్దఎత్తున నినాదాలు చేశారు. వేలాది రూపాయలు పెట్టుబడులు పెట్టి పంటసాగు చేస్తున్నా కనీసం కూలీ ఖర్చులు సైతం రావడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మార్కెట్లో కిలో దొండకాయలు 20 రూపాయలకు అమ్ముడు పోతుంటే రైతుకు కనీసం రెండు రూపాయలు కూడా దక్కడం లేదని రైతులు వాపోయారు.
ఇవీ చూడండి...