విజయనగరం జిల్లా ఎస్.కోట మండలం బొడ్డవర చెక్ పోస్ట్ సమీపంలో కారులో 90కిలోల గంజాయిని (90kgs Ganja Seized) ఎస్.కోట పోలీసులు పట్టుకున్నారు. పోలీసుల సమాచారం ప్రకారం చెక్ పోస్ట్ సమీపంలో రోడ్డు పక్కన ఆపి ఉన్న కారును స్థానికులు గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన ఖాకీలు తనిఖీ చేపట్టారు.
కారులో 90కిలోల గంజాయి ఉన్నట్లు వారు గుర్తించారు. అయితే కారులో మాత్రం ఎవరూ లేరన్నారు. గంజాయిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామని ఎస్ఐ లోవరాజు తెలిపారు. గంజాయి విలువ సూమారు రూ. నాలుగు లక్షల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. విశాఖ ఏజెన్సీ నుంచి గంజాయి తీసుకు వస్తూ చెక్ పోస్ట్ వద్ద పోలీసులు సోదాలు చేస్తుండడం చూసి భయపడి.. కారు వదిలేసి రవాణా చేస్తున్న వారు పారిపోయి ఉంటారని భావిస్తున్నారు.
ఇదీ చదవండి : ఆర్టీసీ బస్సులో గంజాయి రవాణా.. ఇద్దరి పట్టివేత