విజయనగరం జిల్లా ఎస్. కోట మండలం బొడ్డవార చెక్‌పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో సుమారు 20 లక్షల రూపాయల విలువ చేసే 420 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. టమాటలు తరలిస్తున్న ఓ ట్రక్కులో సుమారు 150 ప్యాకెట్లలో సంబల్‌కు అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. టమాటల బాక్సుల్లో అడుగు భాగంలో వీటిని దాచి రవాణా చేస్తున్నారు.
వాహన చోదకుడిపై అనుమానం వచ్చిన పోలీసులు ట్రక్కును పరిశీలించగా గంజాయి బయటపడింది. డ్రైవర్‌తో పాటు క్లీనర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. గంజాయిని సీజ్ చేసి ఇద్దరిని అరెస్ట్ చేయగా.. మరో ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు విజయనగరం డీఎస్పీ అనిల్ కుమార్ వెల్లడించారు.
ఇదీ చదవండి: గంజాయితో పట్టుబడిన ఆరుగురు.. కేసు నమోదు