ETV Bharat / state

12 పూరి గుడిసెలు, 3 కోళ్ల షెడ్లు దగ్ధం.. ఎక్కడంటే?

12 houses were gutted in AP: రెండు వేరువేరు అగ్ని ప్రమాదాల్లో 12 ఇళ్ల, మూడు కోళ్ల షెడ్లు దగ్ధమైన ఘటన విజయనగరం జిల్లాలో చోటుచేసుకుంది. రాత్రి ఓ ఇంట్లో చెలరేగిన మంటల కారణంగా 12 ఇళ్లు దగ్ధంకాగా.. కోళ్ల షెడ్డు తగలబడింది. ఈ ఘటనలో రూ.15 లక్షల విలువచేసే 4వేల కోడి పిల్లలు అగ్నికి అహుతయ్యాయి.

12 houses were gutted in AP
12 పూరి గుడిసెలు దగ్ధం
author img

By

Published : Jan 14, 2023, 6:25 PM IST

Updated : Jan 14, 2023, 10:16 PM IST

12 houses were gutted in a fire: విజయనగరం జిల్లాలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగడంతో 12 ఇళ్లు దగ్ధమయ్యాయి. మరో అగ్ని ప్రమాదంలో మూడు కోళ్ల షెడ్లు కాలిపోయిన ఘటనలో రూ. 15 లక్షల ఆస్తి నష్టం వాటిల్లింది. ఈ ఘటన పండగపూట నెలకొనడంతో ఆయా కుటుంబాల ప్రజలు తాము వీధిన పడ్డామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి ఆర్థిక సహాయం చేయాలని కోరుకుంటున్నారు.

12 పూరి గుడిసెలు దగ్ధం

విజయనగరంజిల్లా లక్కవరపుకోట మండలం రేగలో పండుగ పూట విషాదం చోటుచేసుకుంది. లక్కవరపుకోట మండలంలోని రేగ గ్రామంలో అర్ధరాత్రి ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో మొత్తం 12 పూరి గుడిసెలు కాలి బూడిదయ్యాయి. ఇళ్లల్లో ఉన్న వస్తువులతో పాటుగా.. దుస్తులు, నిత్యవసర సరుకులు, నగదు కాలిబూడిదయ్యాయి. బాధితులు కట్టుబట్టలతో మిగిలారు. పండగ ముందు ప్రమాదం జరగడంతో బాధిత కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. లక్కవరపుకోట తహశీల్దార్ రామకృష్ణ ఘటన ప్రదేశాన్ని పరిశీలించారు. ప్రమాదానికి కారణాలపై ఆరా తీశారు. బాధితులతో మాట్లాడారు, సూమారు రూ.30 లక్షల వరకు నష్టం జరిగినట్లు తెలుస్తుంది. ఆస్తి నష్టం అంచనా వేయాల్సి ఉందని అధికారు తెలిపారు.

కోళ్ల షెడ్డులో అగ్ని ప్రమాదం: పూసపాటిరేగ మండలంలోని చిన్న పతివాడలో జరిగిన అగ్ని ప్రమాదంలో మూడు కోళ్ల షెడ్లు కాలిపోయాయి. సుమారు 4వేల కోడి పిల్లలు అగ్నికి అహుతి అయ్యాయి. సుమారుగా 15లక్షలు ఆస్తి నష్టం జరిగినట్లు బాధితులు తెలిపారు.. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలి షెడ్డు యజమాని కోరుతున్నాడు.

ఇవీ చదవండి:

Last Updated : Jan 14, 2023, 10:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.