13 ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్న ఒప్పంద ఉద్యోగులను సీఎం జగన్ రోడ్డున పడేశారని విజయనగరం జిల్లా 104 కాంట్రాక్టు ఉదోగుల యూనియన్ ప్రధాన కార్యదర్శి బాలరాజు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగారు. 104 ఉద్యోగుల ద్వారా వైద్య సేవలను వినియోగించుకుని ప్రస్తుతం రోడ్డున పడేశారని తెలిపారు. వైకాపా అధికారంలోకి వస్తే న్యాయం చేస్తామని చెప్పి ఎవ్వరూ తమను పట్టించుకోవడం లేదని వివరించారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 104 కాంట్రాక్టు ఉద్యోగులను ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మాసిస్టులు, స్టాఫ్ నర్సులు, వాచ్మెన్లను పీహెచ్సీ, సీహెచ్సీ సెంటర్లలో సర్దుబాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. తక్షణం జీవో 27ను అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. తమ సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని.. లేదంటే, నిరసనలు మరింత ఉద్ధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు.
ఇదీ చదవండి: