కరోనా బాధితుల కోసం సీఎం సహాయనిధికి విజయనగరం జిల్లా చీపురుపల్లి మాజీ ఎమ్మెల్యే గద్దె బాబురావు లక్ష రూపాయలు విరాళంగా ఇచ్చారు. విరాళానికి సంబంధించిన చెక్కును చీపురుపల్లి ఎమ్మార్వోకు అందజేశారు. కరోనాపై యుద్ధానికి వ్యాపారులు, ప్రైవేటు సంస్థలు ముందుకొచ్చి విరాళాలు అందజేయాలని బాబురావు పిలుపునిచ్చారు. కరోనా వైరస్ నియంత్రణలోకి రావాలంటే ప్రజలు సామాజిక దూరం పాటించాలన్నారు. ప్రభుత్వం విధించిన లాక్డౌన్ నిబంధనలకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.
ఇదీచదవండి