Adani Data Center : విశాఖ రుషికొండ వద్ద ఐటీ హిల్స్‌లో అదాని డేటా సెంటర్‌కు కేటాయించిన హిల్ నంబర్ 4 పనులను.. ఉత్తరాంధ్ర వైసీపీ సమన్వయ కర్త, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఐటీ శాఖ మంత్రి అమర్నాథ్ పరిశీలించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో భాగంగా మే 3న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటుకి ముఖ్యమంత్రి జగన్ శంకుస్థాపన చేయనున్నట్లు మంత్రులు వెల్లడించారు. అదే రోజు విశాఖ టెక్ పార్క్ పేరుతో 134 ఎకరాల్లో నిర్మిస్తున్న.. అదాని డేటా సెంటర్‌కు కూడా శంకుస్థాపన చేయనున్నారని ప్రకటించారు. ఈ డేటా సెంటర్ ద్వారా 39 వేల మందికి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు.
విమానాశ్రయం ఉత్తరాంధ్రకు తలమానికం కాబోతుందని ఉత్తరాంధ్ర వైసీపీ సమన్వయ కర్త వైవీ సుబ్బారెడ్డి అన్నారు. దాదాపు నాలుగు సంవత్సరాల నుంచి విశాఖకు అంతర్జాతీయ విమానాశ్రయం రావాలని.. ఇక్కడి ప్రజలు కోరుకుంటన్నారని అన్నారు. ఉత్తరాంధ్ర ప్రజల ఆశ కూడా అదేనని పేర్కొన్నారు. విశాఖ అన్ని విధాల అభివృద్ది చెందాలంటే అంతార్జాతీయ విమానాశ్రయం వస్తేనే అభివృద్ధి సాధ్యమవుతోందని ప్రజలు నమ్ముతున్నారని తెలిపారు. ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరిక తీర్చాలనే.. ముఖ్యమంత్రి భోగపుర విమానాశ్రయానికి శంకుస్థాపన చేస్తున్నారని వివరించారు. కేవలం శంకుస్థాపన మాత్రమే కాకుండా.. పనులను చేపట్టేందుకు అన్ని రకాల అనుమతులు, చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. విశాఖ ప్రాంతంలోని నిరుద్యోగ ప్రజల ఉపాధి కోసం చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. విశాఖ టెక్ పార్కుతో నిర్మిస్తున్న డేటా సెంటర్‌కు విశాఖలో అదే రోజు ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. ఈ పార్కును సుమారు 7 సంవత్సరాల గడువులో పూర్తి చేస్తే.. వేల సంఖ్యలో ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉందన్నారు. ఈ రెండు ప్రాజెక్టుల వల్ల ఉత్తారంధ్ర ప్రజలకు ఎంతో మేలు చేకురుతుందని వివరించారు. ఈ రెండు ప్రాజెక్టులను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని అన్నారు.
ఏడు సంవత్సరాలలో ఈ పార్కు నిర్మాణం పూర్తి చేసుకుని వేల సంఖ్యలో ఉపాధి అవకాశాలు కల్పిస్తుందని మంత్రి అమర్నాథ్ తెలిపారు. భోగపురం విమానాశ్రయం అనగానే ప్రతిపక్షాలే చేశాయని మాట్లాడుతున్నాయన్నారు. రామయపట్నం బీచ్ అంశంలో అలాగే ప్రవర్తిస్తున్నాయని అన్నారు. విశాఖను రాజధాని చేయాలని.. ఉత్తరాంధ్రకు మంచి చేయాలని ముఖ్యమంత్రి ఇవన్ని చేస్తున్నారని తెలిపారు.
''విమానాశ్రయం ఉత్తరాంధ్రకు తలమానికం కాబోతుంది. దాదాపు నాలుగు సంవత్సరాల నుంచి విశాఖకు అంతర్జాతీయ విమానాశ్రయం రావాలని.. ఇక్కడి ప్రజలు కోరుకుంటన్నారు. ఉత్తరాంధ్ర ప్రజల ఆశ కూడా అదే. విశాఖ అన్ని విధాల అభివృద్ది చెందాలంటే అంతార్జాతీయ విమానాశ్రయం వస్తేనే అభివృద్ధి సాధ్యమవుతోందని ప్రజలు నమ్ముతున్నారు."- వైవీ సుబ్బారెడ్డి, ఉత్తరాంధ్ర వైసీపీ సమన్వయ కర్త
''ఏడు సంవత్సరాలలో ఈ పార్కు నిర్మాణం పూర్తి చేసుకుని వేల సంఖ్యలో ఉపాధి అవకాశాలు కల్పింస్తుంది. విశాఖను రాజధాని చేయాలని.. ఉత్తరాంధ్రకు మంచి చేయాలని ముఖ్యమంత్రి ఇవన్ని చేస్తున్నారు.''- రాష్ట్ర మంత్రి అమర్నాథ్
ఇవీ చదవండి :