విశాఖ జిల్లా అనకాపల్లి మండలం సత్యనారాయణ పురంలోని కనకదుర్గ ఆలయంలో సింహద్వారాన్ని వైకాపా పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకులు దాడి రత్నాకర్ ప్రారంభించారు. మూలా నక్షత్రం కావడంతో ఆలయంలో అమ్మవారిని సరస్వతి దేవిగా అలంకరించారు. విద్యార్థులకు అక్షరాభ్యాసం చేయించారు. ఈ సందర్భంగా వైకాపా నేతలు అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఇవీ చూడండి: