కేంద్ర ప్రభుత్వం డబ్బులు సమకూర్చుకునే యోచనలో భాగంగా స్టీల్ ప్లాంట్ను ప్రైవేట్ పరం చేస్తే.. ప్రజలు చూస్తూ ఊరుకోబోరని వైకాపా జాతీయ కార్యదర్శి విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ అంశాన్ని వ్యతిరేకిస్తూ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ పార్క్లో చేపట్టిన నిరాహార దీక్షలో ఆయన పాల్గొన్నారు.
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను కేంద్రం వెంటనే ఉపసంహరించుకోవాలని విజయసాయి డిమాండ్ చేశారు. అన్ని పార్టీల నేతలు ఏకమై కేంద్రంపై ఒత్తిడి తెస్తామని... పరిశ్రమను ఎట్టి పరిస్థితుల్లోనూ కాపాడుకుంటామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ.. ఎమ్మెల్యేలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఇదీ చదవండి:
'విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చాలా దారుణం'