ETV Bharat / state

సొమ్మసిల్లిన నాగుపాము.. ఊపిరి ఊదిన యువకుడు! - AOB Latest News

పాము చూస్తే మనం పరుగు లంఖించుకుంటాం. అలాంటిది.. ఆ పామును పట్టుకొని, ముక్కులో స్ట్రా పెట్టి గాలి ఊదాలంటే... మనవల్ల కాదు అని చేతులెత్తేస్తాం. కానీ మల్కన్​గిరికి చెందిన స్నేహసిస్ పట్నాయక్ అనే యువకుడు.. ఎండ కారణంగా సొమ్మసిల్లిన పాముకు ఊపిరి ఊదాడు. నాగుపామును బతికించి.. ప్రశంసలు అందుకున్నాడు.

సొమ్మసిల్లిన నాగుపాము.. ఊపిరి ఊదిన యువకుడు!

author img

By

Published : May 29, 2021, 9:14 PM IST

సొమ్మసిల్లిన నాగుపాము.. ఊపిరి ఊదిన యువకుడు!

ఆంధ్రా-ఒడిశా సరిహద్దులోని మల్కన్​గిరి జిల్లాలో వేసవి తాపనికి ఓ పాము సొమ్మసిల్లింది. జిల్లా కేంద్రంలోని నువగుడా వీధిలో ఓ ఇంట్లోకి నాగుపాము వచ్చింది. పామును చూసిన ఆ ఇంట్లో వాళ్లు... స్నేక్ హెల్ప్​లైన్ టీంకు తెలిపారు. స్నేక్ హెల్ప్​లైన్​కు చెందిన సభ్యుడు స్నేహసిస్ పట్నాయక్ వచ్చి పామును బయటకి తీశారు.

వేసవి తాపానికి అప్పటికే ఆ పాము సొమ్మసిల్లి ఉన్నట్టు గుర్తించారు. స్ట్రాతో పాముకు గాలి ఊది బతికించాడు. స్నేహసిస్ పట్నాయక్ పనిని స్థానికులు ప్రశంసించారు. గాలి ఊదిన తర్వాత పాము మెల్లగా కదలింది. తీవ్ర ఎండ కారణంగా... పాము సొమ్మసిల్లింది అని స్నేహసిస్ పట్నాయక్ తెలిపారు.

ఇదీ చదవండి:

కాక్​టెయిల్ ఔషధం పనితీరులో సానుకూల ఫలితాలు: డా.శ్రీనివాస చౌదరి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.