దివంగత నేత కింజరాపు ఎర్రన్నాయుడు 8వ వర్ధంతి వేడుకలు విశాఖలో ఘనంగా నిర్వహించారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాయంలో ఎర్రన్నాయుడు చిత్రపటానికి పూలమాలలు వేసి పార్టీ కార్యకర్తలు నివాళులర్పించారు. కేంద్ర మంత్రిగా, పార్లమెంట్ సభ్యుడిగా నిరంతరం ఆయన ప్రజా సేవకే అంకితమయ్యారని పార్టీ కార్యకర్తలు కొనియాడారు. తెలుగుదేశం పార్టీలో కీలక నేతగా ఉంటూ పార్టీ ఎదుగుదలకు ఆయన చేసిన సేవలు ఎనలేనివని గుర్తు చేసుకున్నారు.
ఇదీచదవండి