ప్రజాపాలనకు అవసరమైన వ్యవస్థలను వికేంద్రీకరించే సత్తా ఒక్క ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మాత్రమే ఉందని వైకాపా సీనియర్ నాయకుడు దాడి వీరభద్రరావు అన్నారు. విశాఖలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. రాజధానిని మూడు ప్రాంతాల్లో ఏర్పాటు చేసి... పరిపాలనను వికేంద్రీకరించాలనే బృహత్తర ఆలోచన చేశారంటూ ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ విషయంలో తెదేపా అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ తీరును తప్పుబట్టారు. లేనిపోని వ్యాఖ్యలు మానుకోవాలన్నారు.
ఇదీ చదవండి: