విశాఖ పురపాలక ఎన్నికల్లో వైకాపా అత్యధిక సీట్లు సాధించిన సందర్భంగా... విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కె.కె. రాజు ఆధ్వర్యంలో విజయోత్సవ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ ఉత్తర నియోజకవర్గ పార్టీ కార్యాలయం వద్ద బయలుదేరి నియోజకవర్గ పరిధిలో గల బీఎస్ లేఔట్, సీతమ్మధార, సత్యం కూడలి, గురుద్వార్, సీతమ్మపేట, లలితానగర్, అక్కయ్యపాలెం మహారాణి పార్లర్, 80 ఫీట్ రోడ్, తాటిచెట్ల పాలెం, కంచరపాలెం, ఊర్వశి, మర్రిపాలెం, ఆర్ అండ్ బీ దగ్గర మారియట్ హోటల్, మాధవదార, పట్టాభిరెడ్డి గార్డెన్, పాలీటెక్నికల్ కళాశాల, ఊర్వశి హైవే, తాటిచెట్లపాలెం హైవే , కైలాసపురం, గణేష్ నగర్, నరసింహనగర్ మీదుగా ఉత్తర నియోజకవర్గ కార్యాలయం వద్ద ముగిసింది.
ఈ కార్యక్రమంలో కె. కె. రాజుతోపాటు నియోజకవర్గ పరిధిలోని కొర్పొరేటర్లు, వార్డు అధ్యక్షులు, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, యువకులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: