ETV Bharat / state

ప్రశాంత విశాఖలో అలజడి రేపుతున్న అరాచకాలు.. రాజకీయ వేటలో బిజిబిజీగా పోలీసులు - visakhapatnam

Crime In Visakha: విశాఖ సాగరతీరంలో ఎంత అలజడి ఉన్నా.. నగరం మాత్రం ప్రశాంతంగా నిద్రపోతుంది. కానీ.. ఈ మధ్య భూ కబ్జాలు, సెటిల్మెంట్లు, హత్యలతో నగరం ఉలిక్కిపడుతోంది. మహా నగరంలో రౌడీషీటర్లు రెచ్చిపోతున్నారు. కొత్తగా గ్యాంగ్‌వార్‌ సంస్కృతీ వేళ్లూనుకుంటోంది. అసాంఘిక శక్తుల ఆట కట్టించాల్సిన పోలీసులు రాజకీయ వేటలో మునిగితేలుతున్నారు. విపక్షాల నిర్బంధానికి, కొత్తగా రుషికొండను కాపలాకాయడానికే.. సగం పోలీసింగ్‌ సరిపోతోంది. అధికారపార్టీ నేతల బందోబస్తుకు కూడా పోతే.. సామాన్యుల భద్రతకు సమయం ఇచ్చేదెవరు. నేరాలపై గస్తీ కాసేదెవరు. నేరాల సంఖ్య పెరగడం ప్రశాంత విశాఖ నగరంలో అశాంతి రేకెత్తిస్తోంది.

Crime In Visakha
విశాఖ రౌడీలు
author img

By

Published : Dec 4, 2022, 7:06 AM IST

Updated : Dec 4, 2022, 7:31 AM IST

Crime In Visakha: విశాఖలోని ఎంవీపీలో కాలానీలో గృహిణిలు అక్కడి తాగాదాలు, గొడవలు చూసి భయపడిపోతున్నారు. "ఇక్కడ తాగిన వారు కుప్పలుగా ఉంటారు. ఏదో తగువు ఉంటూనే ఉంటుంది. ఇక్కడ తాగి తూలుతూ గొడవలకు దిగుతూనే ఉంటారు. ఇటు రావాలంటేనే భయంగా ఉంటుంది. ఈ ఏరియాకి కొత్తగా వచ్చిన వారు ఏంటీ ఇలా ఉంది అని ప్రశ్నిస్తున్నారు. ఈ గొడవల మేమే ఖాళీ చేసి వెల్లిపోవాలి అనిపించేలా ఉంది." ఇదీ వైకాపా సర్కార్ పాలనా రాజధానిగా ప్రవచిస్తున్న విశాఖలో ఓ సామాన్య గృహిణి భయాందోళన. ఎంవీపీ కాలనీలో వీధి రౌడీల కత్తిపోట్లు, నడిరోడ్డుపై నెత్తుటి ధారలు చూసి భీతిల్లిపోయి చేసిన వ్యాఖ్యలివి. విశాఖ నగరంలో ఇలాంటి ఘటనలు భయానకం సృష్టిస్తున్నాయి.

2022 జులై 9న విశాఖ పెందుర్తి బృందావన్ గార్డెన్స్‌లో నల్లమ్మపై దాడి జరిగింది. ఇది జరిగిన సరిగ్గా నెలకు అంటే.. ఆగస్టు 8న చినముషిడివాడలో అపార్ట్‌మెంట్ వాచ్‌మెన్‌ అప్పారావు దంపతులను రాడ్‌తో కొట్టి హత్య చేశారు. వారం గడిచేసరికి అంటే.. ఆగస్టు 14న సుజాతనగర్‌ నాగమల్లి లేఔట్‌లో వాచ్‌ఉమెన్‌ లక్ష్మి దారుణ హత్యకు గురైంది. ఈ సీరియల్‌ హత్యల సీరియల్‌ కిల్లర్‌ ఒక్కడే. మొదటి హత్య జరిగినప్పుడే పోలీసులు సీరియస్‌గా తీసుకుని హంతకుడిని పట్టుకుని ఉంటే.. తర్వాతి ఘటనలకు అడ్డుకట్టపడేది.

ఆగస్టు 17న విశాఖ ఎంవీపీ కాలనీ ఉషోదయ కూడలిలో అనీల్‌ అనే రౌడీషీటర్‌ను అందరూ చూస్తుండగానే ఇద్దరు వ్యక్తులు కత్తులతో కుత్తుక కోశారు. అంతకు గంటన్నరముందు అక్కడున్న బార్‌లో తాగి గొడవపడ్డారు. బయటికొచ్చి కత్తులు దూసుకున్నారు. అక్కడ కనీస గస్తీ ఉన్నా, పోలీసులు ఘటనాస్థలానికి సత్వరమే చేరుకోగలిగినా.. ఆ హత్యను ఆపే వీలుండేది. సెప్టెంబర్‌ 8వ తేదీన మదీనాబాగ్‌ జేఎన్​ఎన్​యూఆర్​ఎం కాలనీ ఓ ఇంట్లో చొరబడిన దుండగులు తల్లీకుమారులను అంతమొందించారు. అప్పుగా తీసుకున్న 500 రూపాయలు తిరిగి చెల్లించాలని అడిగినందుకు ధర్మాల అప్పలరెడ్డి అలియాస్ అప్పన్న అనే వ్యక్తిని గౌరీశంకర్ అనే రౌడీషీటర్ దారుణంగా చంపేయడమూ వినడానికే వణుకు పుట్టించింది.

విశాఖ నేరాల్లో ఈ తరహా ఘటనలు ఒక ఎత్తైతే భూ సెటిల్‌మెంట్లు మరో ఎత్తు. పాలనా రాజధాని ప్రచారంతో ఇక్కడ చోటామోటా భూమాఫియాలు స్వైర విహారం చేస్తున్నాయి. రౌడీషీటర్లను అడ్డం పెట్టుకుని బెదిరిస్తున్నారు. ఈ ఏడాది జూన్‌లో పాసి రామకృష్ణ అనే స్థిరాస్తి వ్యాపారిని కొందరు రౌడీషీటర్లు గదిలో బంధించి, నోటికి ప్లాస్టర్ వేసి మెడపై కత్తి పెట్టి బెదిరించారు. కోటి రూపాయలు డిమాండ్‌ చేశారు. విశాఖలో ఈ తరహా కల్చర్‌.. ఎప్పట్నుంచో స్థిరాస్తి వ్యాపారం చేసుకుంటున్నవారికి పెద్ద షాకిచ్చింది.

విశాఖ భూదందాల్లో రౌడీ షీటర్లదే రాజ్యం. ప్రాంతాల వారీగా పంచుకుని పంచాయితీలు చేస్తున్నారనే విమర్శలున్నాయి. కొందరు రౌడీషీటర్లు భూముల్ని కబ్జా చేస్తున్నారు. తిరగబడలేని వారిని గుర్తించి.. వారి స్థలాలకు నకిలీ పత్రాలు సృష్టించి కాజేస్తున్నారు. అగనంపూడికి చెందిన చేకూరి సత్యవతి, అయినంపూడి సత్యవతికి అగనంపూడిలోని సర్వే నంబరు 141లో అయిదేసి సెంట్ల చొప్పున భూమి ఉంది. గాజువాక రౌడీషీటర్ పువ్వుల శ్రీనుతోపాటు.. మరికొందరు నకిలీ పత్రాలు సృష్టించి, ఆ భూమి కబ్జాచేసేందుకు యత్నించారు, బాధితుల్ని బెదిరించారు. విశాఖలో 646 మంది రౌడీ షీటర్లుంటే ఇందులో 150 మంది వివిధ హత్యకేసుల్లో నిందితులే. అదే అర్హతగా భావిస్తూ సెటిల్మెంట్లు చేసుకుంటున్నారు. గంజాయి, మాదకద్రవ్యాల సరఫరా, బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నారు. 150 మందికి పైగా రౌడీషీటర్లు పోలీసు రికార్డుల్లోని చిరునామాల్లో లేరు. వారి కదలికలపై నిఘా లేదు. రౌడీషీటర్లలో చాలామందికి అధికార పార్టీ నాయకుల అండదండలు పుష్కలంగా ఉన్నాయి. కొందరైతే అధికార పార్టీ నాయకుల ముఖ్య అనుచరులుగా.. చలామణిఅవుతున్నారు. ఫలితంగా పోలీసులూ వారి జోలికెళ్లడంలేదు.

రౌడీషీటర్ల అరాచకాలు చాలవన్నట్లు విశాఖలో కొత్తగా గ్యాంగులు హల్‌చల్‌ చేస్తున్నాయి. హైపర్ జోయ్స్, దండుపాళ్యం, చిట్టిమాము, ఖాసిం గ్యాంగ్, త్రీస్టార్ గ్యాంగ్.. ఇవన్నీ ఇప్పుడు క్రియాశీలకంగా ఉన్న ముఠాలు. హైపర్ బాయ్స్ గ్యాంగ్‌ కత్తులు, మారణాయుధాలతో బెదిరిస్తూ సెటిల్మెంట్లు చేస్తుంది. మాధవధార ప్రాంతానికి చెందిన కొందరు యువకులు ఈ ముఠా కట్టారు. బాధితుల తరపునకాకుండా, మోసగాళ్లకు కొమ్ముకాయడం, సొమ్ము చేసుకోవడం వీళ్ల హాబీ. రుణగ్రహీతలను బెదిరిస్తారు. రావాల్సిన దానికంటే ఎక్కువ వసూలు చేస్తారు. కాదుకూడదంటే ఆస్తులే రాయించుకుంటారు. చిట్టిమాము తన చుట్టూ ఆరుగురు బొన్సర్లను పెట్టుకుని తిరుగుతాడని.. పోలీసులే గుర్తించారు. గంజాయి, మాదకద్రవ్యాల సరఫరా, ఇతర నేరాలు, సెటిల్మెంట్ల చేసుకుటూ ఈ గ్యాంగులు మనుగడ సాగిస్తుంటాయి.

ఇలాంటి అరాచకాలు విశాఖలో శాంతిభద్రతలపై అనుమానాలు రేకెత్తిస్తుంటే.. వాటిని కాపాడాల్సిన పోలీసులు రాజకీయ పోలీసింగ్‌లో తరిస్తున్నారనే విమర్శలున్నాయి. మీ రక్షణలో అహర్నిశం అని బోర్డుపైరాసి పెట్టిన పోలీసులు అనుక్షణం వైసీపీ నాయకుల రక్షణలో తరిస్తున్నారు. విపక్షాలను కట్టడి చేయడంలో తలమునకలవుతున్నారు. నేర నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల ఛేదన వంటి మూల విధులను మూటకట్టి పక్కనపడేశారు ఇప్పుడైతే.. విశాఖ రుషికొండకే సగం పోలీసుల కాపలా అన్నట్లుంది. కోర్టులు ఆదేశించినా అటువైపు ఎవర్నీ వెళ్లనివ్వరు. అక్కడేం జరుగుతుందో దగ్గరికెళ్లి చూడనివ్వరు. ప్రభుత్వ విధానాలపై నిరసన అంటే చాలు ముందస్తు అరెస్టులు, నోటీసులు, గృహనిర్బంధాలు. ఏకంగా ప్రతిపక్షనేత చంద్రబాబునే విశాఖ విమానాశ్రయం నుంచి తిప్పి పంపేశారు. జనసేన అధినేత పవన్‌ను హోటల్‌లో నిర్బంధించేశారు. అదే సీఎం పర్యటన ఉంటే పరదాలు కట్టడం, బారికేడ్లు పాతడం, దుకాణాలు మూయించడం వంటి అసాధారణ భద్రతను భుజానికెత్తుకుంటారు. మొత్తంగా ప్రభుత్వ వ్యతిరేక గళాలను నొక్కేయడానికే సమయం చాలడంలేదు.

పోలీసులు రాజకీయ సేవలో తరిస్తుంటే నేరగాళ్లు వాళ్లదారిలో వాళ్లు స్వైరవిహారం చేస్తున్నారు. తెలుగుదేశం ఐదేళ్ల పాలనతో పోలిస్తే వైసీపీ మూడున్నరేళ్లలో విశాఖ పరిధిలో నేరాలు పెరిగాయి. 2018లో విశాఖలో 55 హత్యాయత్నాలు నమోదు కాగా.. గతేడాది ఆ సంఖ్య 78కు పెరిగింది. 2018లో 32 హత్యలు చోటుచేసుకోగా నిరుడు 36 నమోదయ్యాయి. ఈ ఏడాది జులై నుంచి సెప్టెంబరు మధ్య మూడు నెలల్లో 11 హత్యలు జరిగాయి. ఫిర్యాదులు, కేసుల నిష్పత్తికైతే పొంతనేలేదు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక భూ వివాదాలపై విచారణ కోసం 'ప్రీలిటి గేషన్ కౌన్సెలింగ్ ఫోరం ఏర్పాటుచేశారు. ఈ విభాగానికి ఇప్పటివరకూ 12 వందల52 ఫిర్యాదులు అందితే కేవలం 25 కేసులే నమోదుచేసి చేతులు దులుపుకున్నారు. సివిల్ వివాదాల ముద్రవేసి కోర్టులోనే తేల్చుకోవాలని పంపేస్తున్నారనే విమర్శలున్నాయి. గతంలో కమిషనరేట్ పరిధిలోని పోలీస్‌ సబ్‌ డివిజన్‌కు ఒకటి చొప్పున 'డాక్యుమెంట్ ప్రాడ్ ఇన్వెస్టిగేషన్ సెల్ ఏర్పాటుచేసి సీఐ స్థాయి అధికారితో కబ్జా కేసులపై దర్యాప్తు చేయించేవారు. ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదు. టీడీపీ హయాంలో 2015లో భూ కబ్జాలకు సంబంధించి 35 కేసులు నమోదు చేశారు. 158 మంది నిందితుల్ని గుర్తించారు. వారిలో 17 మందిపై రౌడీషీట్లు తెరిచారు. భూకబ్జాలకు పాల్పడిన వారి నుంచి 21 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీన పరుచుకుని రెవెన్యూ అధికారులకు అప్పగించారు. ప్రస్తుతం అలాంటి చర్యలే కొరవడ్డాయి. రాజకీయాల సేవలకు వెచ్చించ సమయంలో కొంతైనా శాంతిభద్రతల పరరిక్షణకు వెచ్చిస్తే విశాఖ ప్రశాంతంగాఉంటుందని సామాన్యులు కోరుతున్నారు.

ప్రశాంత విశాఖలో అలజడి రేపుతున్న అరాచకాలు.. రాజకీయ వేటలో బిజిబిజీగా పోలీసులు

ఇవీ చదవండి:

Last Updated : Dec 4, 2022, 7:31 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.