తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో... ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కలిగించే కళాబృందాలకు తమ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని విశాఖ రేంజ్ డీఐజీ ఎల్.కె.వి.రంగారావు అన్నారు. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ బ్యూరో ఆఫ్ ఔట్ రీచ్ ఆధ్వర్యంలో... విశాఖ వైశాఖి జల ఉద్యానవనంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వామపక్ష, తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి పథకాలు అనే అంశంపై కార్యశాల నిర్వహించారు. సీఆర్పీఎఫ్ బలగాలు ఔట్ రీచ్ కార్యక్రమాలు, పోలీస్ శాఖ 'ప్రేరణ', 'యువత',' గిరి సంజీవిని' కార్యక్రమాలను గిరిజన ప్రాంతాల్లో నిర్వహిస్తున్నాయని రంగారావు తెలిపారు.
ఇదీ చదవండి: