విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చర్యలను కేంద్రం విరమించుకోవాలని కూర్మనపాలెం శిబిరం వద్ద కార్మిక సంఘాలు నిరసన చేపట్టాయి. విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు అని నినాదాలు చేశారు. కేంద్రం స్టీల్ ప్లాంట్ పై నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు ఉక్కు సంకల్పంతో కార్మికులు ఉద్యమించాలని నేతలు పిలుపునిచ్చారు.
స్టీల్ ప్లాంట్ గుర్తింపు సంఘం అధ్యక్షుడు అయోధ్య రామ్, ఆదినారాయణ, మంత్రి రాజశేఖర్, మస్తానప్ప తదితరులు నిరసనలో పాల్గొన్నారు. దిల్లీ వెళ్లి మరోసారి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని నాయకులు తెలిపారు.
ఇదీ చదవండి:
రాయలసీమ ఎత్తిపోతలపై తెదేపా ఎమ్మెల్యేల అభ్యంతరం... సీఎం జగన్కు లేఖ!