ETV Bharat / state

'చేతులెత్తి మొక్కుతాం... మద్యం అమ్మకాలు ఆపండి' - మద్యం అమ్మకాలపై మహిళల ఆగ్రహం

చేతులెత్తి మొక్కుతామని... దయచేసి మద్యం అమ్మకాలు ఆపేయాలని.. తెదేపా మహిళా కార్యకర్తలు ప్రభుత్వాన్ని కోరారు. మందు కోసం జనం గుమిగూడడం వలస వైరస్ వ్యాప్తి పెరిగే అవకాశం ఉందన్నారు. విశాఖలో మద్యం దుకాణాల వద్ద ఆందోళన చేపట్టారు.

women pleads to government for stops wine shops
'చేతులెత్తి మొక్కుతాం.. మద్యం అమ్మకాలు ఆపండి'
author img

By

Published : May 5, 2020, 5:59 PM IST

రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న మద్యం అమ్మకాల నిర్ణయంపై మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం అనుమతించిందని రాష్ట్ర ప్రభుత్వం నిన్నటి నుంచి మద్యం అమ్మకాలు ప్రారంభించింది.

భౌతిక దూరాన్ని విస్మరించి మందు కోసం మద్యం ప్రియులు ఎగబడటంతో కరోనా వైరస్ వ్యాప్తి అధికమవుతుందేమోనని అందరూ ఆందోళన చెందుతున్నారు. విశాఖలో తెలుగుదేశం పార్టీ మహిళా కార్యకర్తలు దండం పెట్టి మరీ అమ్మకాలు ఆపేయాలని కోరారు.

ఇవీ చదవండి.. 40 రోజుల ప్రశాంతతను పోగొట్టారంటూ మహిళల ధర్నా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.