ETV Bharat / state

తనతో వేరే వాళ్ల సాన్నిహిత్యం తట్టుకోలేకపోతున్నా.. ఏం చేయాలి? - visakhapatnam news

Love Confusion: ఇన్‌స్టాలో ఒకబ్బాయి పరిచయమయ్యాడు. అందంగా ఉంటాడు. కొన్నాళ్లు ఫోన్‌లో మాట్లాడుకున్న తర్వాత బయట కూడా కలుసుకునేవాళ్లం. ఓసారి నా బెస్ట్‌ఫ్రెండ్‌కి తనని పరిచయం చేశా. తర్వాత వాళ్లిద్దరూ నాకు చెప్పకుండా కలిసి తిరుగుతున్నారని తెలిసింది. నేనిది తట్టుకోలేకపోతున్నా. వాళ్లు దూరంగా ఉండాలంటే ఏం చేయాలి? ప్రస్తుతం చాలా మంది సమస్య ఇది. మరి ఏం చేయాలో తెలుసా?

love
ప్రేమ
author img

By

Published : Dec 24, 2022, 1:47 PM IST

Love Confusion: మీతో సన్నిహితంగా ఉండే తను వేరొకరితోనూ ఎందుకు క్లోజ్‌గా ఉండకూడదు? అలా చేయడం వాళ్లిద్దరి వ్యక్తిగతం. కాదనడానికి మీరెవరు? ఒకవేళ మీరు ఆ అబ్బాయిని ప్రేమిస్తున్నారా? అదే గనక నిజమైతే మీది కేవలం ఆకర్షణే తప్ప నిజమైన ప్రేమ కాదు. ఆన్‌లైన్‌లో పరిచయం, చాటింగ్‌, ఫోన్లు మాట్లాడుకోవడం.. వీటినే ప్రేమగా పొరబడుతున్నారు ఈ కాలం అమ్మాయిలు, అబ్బాయిలు చాలామంది. ఎక్కువగా ఎమోషనల్‌ అయిపోయి అనవసర సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు.

ఒకరకంగా చెప్పాలంటే అతడితో మీది ప్రేమే కాదు. ఆ అమ్మాయి విషయానికొస్తే.. తను బెస్ట్‌ ఫ్రెండ్‌ అన్నారు. అందులోనూ వాస్తవం లేదనిపిస్తోంది. ఒకవేళ అదే గనక నిజమైతే తను మీతో అన్ని విషయాలూ పంచుకునేది. మీరు బాధ పడుతున్నారని తెలిస్తే.. మిమ్మల్ని ఓదార్చడానికి ప్రయత్నించేది. ఒకవేళ వాళ్లిద్దరి మధ్య ప్రేమలాంటిది ఏదైనా ఉంటే నిర్భయంగా మీతో పంచుకునేది.

ఈ వయసులో ప్రేమ, సామాజిక మాధ్యమాలకు ఆకర్షితులవడం సహజమే. కానీ వాటి ఒరవడిలో కొట్టుకుపోవద్దు. జీవితంలో ఇంతకన్నా ముఖ్యమైనవి కెరియర్‌, తల్లిదండ్రులు, పెళ్లి అనే లక్ష్యాలు. మీరు కష్టపడి ఎదిగి మంచి స్థాయికి చేరుకుంటే చాలామంది మీ స్నేహం కోరి వస్తారు. ఎంతోమంది అబ్బాయిలు మిమ్మల్ని ఇష్టపడతారు. ముందు వీటిపై దృష్టి పెట్టండి. ఈ ప్రపంచం విశాలమైంది. మంచి మనుషులకు కొదవ లేదు. సంకుచితమైన వ్యక్తుల కోసం ఎక్కువగా ఆలోచించి మీ సమయాన్ని వృథా చేసుకోవద్దు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.