ETV Bharat / state

భర్త అందంగా లేడని భార్య ఆత్మహత్య! - krishnapuram recent crime news

ప్రాణం కంటే అందమే ఎక్కువయ్యిందా వివాహితకు. తనకు తాళి కట్టిన భర్త అందంగా లేడని లేఖ రాసి మరీ ప్రాణం తీసుకుంది. ఈ ఘటన విశాఖ జిల్లా అనకాపల్లిలో జరిగింది.

wife committed suicide
భర్త అందంగా లేడని భార్య ఆత్మహత్య
author img

By

Published : Jun 16, 2020, 12:53 PM IST

ఇష్టంలేని పెళ్లి చేశారనీ... తన భర్త అందంగా లేడన్న మనస్తాపంతో వివాహిత ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. విశాఖ జిల్లా అనకాపల్లిలో కృష్ణాపురం కాలనీకి చెందిన షేక్ కరీమా ఈ అఘాయిత్యానికి పాల్పడింది. మృతురాలికి దగ్గర బంధువైన రహతుల్లాకు ఇచ్చి 2019లోనే పెళ్లి చేశారు.

భార్యాభర్తలిద్దరూ విశాఖపట్నంలో ఉండేవారు. 2020 మే నెలలో కరీమా పుట్టింటికి వచ్చేసింది. ఈ నెల 13న తనకు ఇష్టం లేని పెళ్లి చేశారినీ... భర్త అందగా లేడని లేఖ రాసింది. తను ఎవరికీ భారం కాకూడదని ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లేఖలో పేర్కొంది. అనంతరం ఈ నెల 15న ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. కేసు నమోదు చేసిన పోలీసులు, మృతురాలు రాసిన లేఖను స్వాధీనం చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: విశాఖలో ఓ కంపెనీలో పేలుడు... ఒకరి మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.