విశాఖ జిల్లా దేవరాపల్లి - పినకోట మార్గంలో శారద నదిపై ఉన్న వంతెన నిర్మాణానికి నోచుకోలేదు. వంతెన అప్రోచ్ పనులు చేపట్టకుండా ఆరేళ్లుగా అసంపూర్తిగానే ఉంది. చుట్టు ప్రక్క గ్రామస్తులు వంతెన పక్కన ఉన్న కాజ్ వే పైనుంచే రాకపోకలు సాగించే వారు.
కొద్ది రోజుల క్రితం భారీ వర్షాలకు కాజ్ వే కొట్టుకుపోయింది. సమస్యపై ఈటీవీ - ఈటీవీ భారత్ లో కథనాలు వచ్చాయి. స్పందించిన విప్ ముత్యాలనాయుడు నిధుల మంజూరుకు కృషి చేశారు. అప్రోచ్ పనులను రూ.41 లక్షలతో చేపడున్నారు. ఈ పనులను వేగంగా పూర్తిచేయాలని అధికారులకు సూచించారు.
ఇవీ చదవండి: