ETV Bharat / state

What Happened Visakha Steel Plant Sankalpam Jagan?: విశాఖ స్టీల్ ప్లాంట్ సంకల్పం ఏమైంది జగన్..?

What Happened Visakha Steel Plant Sankalpam Jagan?: 'విశాఖ ఉక్కు- ఆంధ్రల హక్కు' అంటూ కార్మికులు నినదిస్తున్నా.. ముఖ్యమంత్రి జగన్‌ పట్టించుకోవటం లేదు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలంటూ ధర్నాలు, ఆందోళనలు చేస్తున్నా.. నోరెత్తడం లేదు. ఎన్నికల సమయంలో స్టీల్‌‌ప్లాంట్‌ కార్మికుల పోరాటానికి మద్దతిచ్చిన వైసీపీ నేతల జాడ కనిపించటం లేదు. అధికారం చేపట్టాక స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ నిలిపివేస్తామన్న జగన్ హామీలు ఏమాయ్యాయి..? అని ఉత్తరాంధ్ర ప్రజలు, కార్మికులు వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.

What_Happened_Jagan
What_Happened_Jagan
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 23, 2023, 7:39 AM IST

Updated : Oct 23, 2023, 7:48 AM IST

What Happened Visakha Steel Plant Sankalpam Jagan?: 'ఎన్నికల ముందు ఒక మాట-అధికారం చేపట్టాక మరో మాట' మాట్లాడుతున్నా.. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు, ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో విశాఖ స్టీల్ ప్లాంట్‌పై జగన్ ఇచ్చిన హామీలు ఏమయ్యాయి..? అని నిలదీస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ సంకల్పం ఏమైంది జగన్..? అని ప్రశ్నిస్తున్నారు. ఆనాడు స్టీల్‌ ప్లాంట్‌ కార్మికుల పోరాటానికి మద్దతు అంటూ పాదయాత్రలు, లేఖలు పేరిట హడావిడి చేసిన ఆ వైఎస్సార్సీపీ నాయకులు ఎక్కడికి పోయారు..? అంటూ ధ్వజమెత్తుతున్నారు. నాలుగున్నరేళ్లుగా సీఎం జగన్, వైసీపీ ఎంపీలు స్టీల్ ప్లాంట్ ప్రైవేటికరణపై ఎందుకు కేంద్రంపై ఒత్తిడి తీసుకురాలేకపోతున్నారని ఉత్తరాంధ్ర వాసులు విమర్శలు గుప్పిస్తున్నారు. గట్టిగా ప్రశ్నించినందుకు.. ఛత్తీస్‌గఢ్‌లోని నగర్నార్‌, తమిళనాడులోని స్టెయిన్‌లెస్‌ స్టీల్, పశ్చిమ బెంగాల్‌లోని ఎల్లాయ్‌ స్టీల్‌ కర్మాగారాల ప్రైవేటికరణ కేంద్రం ఆపలేదా..? అని సీఎం జగన్‌పై నిప్పులు చెరుగుతున్నారు.

విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై జగన్‌వి ఉత్తుత్తి మాటలు.. ఉక్కు సంకల్పం పేరిట మోసాలు

Vishaka Steel Plant Workers Criticize YCP Govt: ఉత్తరాంధ్ర అభివృద్ధిలో కీలక భూమిక పోషిస్తున్న 'విశాఖ ఉక్కు' కష్టాల్లో ఉంటే.. ‘రుషికొండ’లో రాజభవంతి ఏర్పాటులో నిమగ్నమైన ముఖ్యమంత్రి జగన్‌ తీరు.. స్టీల్ ప్లాంటు ఊపిరి తీస్తోంది. ఇరవై అయిదు మంది ఎంపీలను గెలిపిస్తే కేంద్రం మెడలు వంచుతామంటూ ఎన్నికల ముందు బీరాలు పలికిన జగన్‌.. ఉక్కు విషయంలో కేంద్రంపై ఒక్కసారైనా ఒత్తిడి తీసుకురాలేదు. ప్రతి పార్లమెంట్‌ సమావేశంలోనూ కంటితుడుపుగా ఎవరో ఒకరు స్టీల్ ప్లాంటు గురించి ప్రశ్న వేస్తే ప్లాంటును అమ్మేస్తాం, ఇందులో వెనకడుగు లేదు అనే రీతిలో కేంద్ర మంత్రులు సమాధానమివ్వడం అలవాటుగా జరిగిపోతుంది. కేంద్రాన్ని గట్టిగా ప్రశ్నించడానికి సొంత అవసరాలు, మొహమాటాలు అడ్డొచ్చాయనుకుంటే.. కనీసం రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన సాయం కూడా ఎందుకు చేయడం లేదని జనం ప్రశ్నిస్తున్నారు.

Vizag Steel Plant: విశాఖ ఉక్కుపై నోరువిప్పని సీఎం జగన్.. కేంద్ర పెద్దల వద్ద మౌనంగా వైసీపీ ఎంపీలు

Chhattisgarh Nagarnar Steel Plant: కేంద్ర ఉక్కు పరిశ్రమశాఖ ఆధ్వర్యంలోని N.M.D.C. పదేళ్ల కిందట ఛత్తీస్‌గఢ్‌లో జగదల్‌పుర్‌ దగ్గర నగర్నార్‌లో 3 మిలియన్‌ టన్నుల ఇంటిగ్రేటెడ్‌ ఉక్కు కర్మాగారం నిర్మించింది. ఇందులో ప్రస్తుతం 400 మంది ఉద్యోగులున్నారు. దీన్ని కూడా ప్రైవేటీకరించేందుకు కేంద్రం అడుగులు వేసి.. బిడ్లు ఆహ్వానించింది. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 15 రోజుల క్రితం.. అక్కడ మూడు జిల్లాల పరిధిలో బంద్‌ గట్టిగానే చేశారు. ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌ అధికారంలో ఉంది. 11 ఎంపీ స్థానాలున్న రాష్ట్రంలో.. బీజేపీ తొమ్మిది సీట్లు గెల్చుకుంది. ప్రస్తుత ఎన్నికల సమయంలో.. ప్రైవేటీకరణపై తీవ్ర వ్యతిరేకతను గమనించిన కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా.. ఇటీవల ఛత్తీస్‌గఢ్‌ పర్యటనలో నగర్నార్‌ స్టీల్ ప్లాంటు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరణ కాదని, దీనిపై హక్కులు గిరిజనులకే ఉన్నాయంటూ ప్రకటించారు.

Tamil Nadu, West Bengal Steel Plants: తమిళనాడులో సేలం స్టెయిన్‌లెస్‌ స్టీల్ కర్మాగారాన్ని అమ్మేయాలని 2002లో అప్పటి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ సమయంలో తమిళనాడులోని పాలక, ప్రతిపక్ష పార్టీలన్నీ ముక్తకంఠంతో వ్యతిరేకించి పెద్ద ఎత్తున ఆందోళన చేశాయి. ఫలితంగా ఇప్పటి వరకు సేలం కర్మాగారం ప్రభుత్వ రంగంలోనే ఉంది. పశ్చిమ బెంగాల్‌లోని దుర్గాపూర్‌ ఎల్లాయ్‌ స్టీల్‌ కర్మాగారాన్ని అమ్మేస్తాం లేదా మూసేస్తామని కేంద్ర ఉక్కు శాఖ ప్రకటిస్తే తృణమూల్‌ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో పశ్చిమ బెంగాల్‌ ఎంపీలు తీవ్రంగా వ్యతిరేకించారు. గత ఎన్నికల సమయంలో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నామని.. కేంద్ర పెద్దలు ప్రకటించారు. ఇటీవల మోక్షగుండం విశ్వేశ్వరయ్య భద్రావతి ఉక్కు కర్మాగారాన్ని మూసివేస్తామని సెయిల్‌ బోర్డులో నిర్ణయం తీసుకున్నారు. దీనిని కన్నడిగులు తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రస్తుతానికి ఆ నిర్ణయం పెండింగ్‌లో పడింది.

అప్పుడు హడావుడి.. ఇప్పుడు మౌనం.. విశాఖ స్టీల్​ ప్లాంట్​ ప్రైవేటీకరణపై సీఎం జగన్​ తీరు

Visakha Steel Plant Workers Fire on YCP Govt: గతంలో రెండు సార్లు విశాఖ ఉక్కు గడ్డు పరిస్థితి ఎదుర్కొన్నప్పుడు అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం, ఎంపీలు అన్ని పార్టీల నేతలతో, కార్మిక సంఘాలతో కలిసి అఖిల పక్షంగా అప్పటి ప్రధానులను కలిసి విశాఖ ఉక్కును ఆదుకున్నారు. ప్రస్తుతం జరుగుతున్న తీరు పరిశీలిస్తే.. ఉక్కు అమ్మకంలో కేంద్రం కన్నా.. రాష్ట్ర ప్రభుత్వమే ఎక్కువ ఉత్సాహం చూపుతోందని కార్మిక వర్గాలు, ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. కార్మిక సంఘాలతో విశాఖ విమానాశ్రయంలో చర్చించినా ఉక్కును ఆదుకున్న దాఖలాలు ఏవని పలువురు ప్రశ్నిస్తున్నారు. స్టీల్ అండ్‌ కోల్‌ పార్లమెంటరీ కమిటీలో ప్రస్తుతం ఇద్దరు వైసీపీ ఎంపీలున్నా.. ఇప్పటి వరకు ప్లాంటును సందర్శించలేదు సరికదా..? ముడిసరకు సరఫరాలో అడ్డంకులపైనా పరిష్కారానికి చొరవ చూపలేదు.

YCP Govt Neglecting Steel Plant Development: ఆర్థిక సంక్షోభంలో అల్లాడుతున్న విశాఖ ఉక్కుకు రాష్ట్ర ప్రభుత్వం తన పరిధిలోనైనా కనీస సాయం చేయడానికి మీనమేషాలు లెక్కిస్తోంది. 'ప్లాంట్‌కు నెలకు 500 కోట్లు చొప్పున 2 వేల కోట్ల రూపాయల.. ఆర్థిక సాయం అందించి, బదులుగా ప్రభుత్వ పథకాలకు అవసరమైన ఉక్కు తీసుకోండి' అని ప్లాంటు అధికార, కార్మిక సంఘాలు విన్నవించాయి. స్టీల్ కొనుగోలుకు జిల్లా స్థాయి పరిశ్రమల శాఖ అధికారిని నియమించి నివేదిక ఇవ్వాలని కంటి తుడుపుగా ఆదేశాలిచ్చి సరిపెట్టేశారు.

YCP Leaders Rush on Visakha Steel Plant: ఎన్నికల జరుగుతున్నాయంటే విశాఖ ఉక్కు ఉద్యమాన్ని వైసీపీ నేతలు ప్రచారాస్త్రంగా ఉపయోగించుకున్నారు. 'మేం అధికారంలోకి రాగానే పరిశ్రమకు అవసరమైన ముడిసరకు విషయంలో ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వాలతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తాం' అని పాదయాత్ర సమయంలో జగన్‌ హామీ ఇచ్చారు. పార్టీ అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు ఆ దిశగా అడుగులే పడలేదు. జీవీఎంసీ ఎన్నికల ఎన్నికల సమయంలో ఎంపీ విజయసాయిరెడ్డి ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ.. స్టీల్‌ప్లాంట్‌ గేటు వరకు పాదయాత్ర చేసి హడావుడి చేశారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 120 మంది ఎంపీలతో సంతకాలు చేయించి, మోదీకి లేఖ పంపామంటూ.. ఈ ఏడాది జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో వైసీపీ సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి ఓట్లు కోసం పావులు కదిపారు. ఇప్పుడు మళ్లీ ఎన్నికల ముందు ఉత్తరాంధ్ర వెనుకబాటు తనం పేరుతో హడావుడి ఆరంభించారు.

CPM Bike Rally Against Steel Plant Privatisation స్టీల్‌ప్లాంట్‌పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దోబూచులాట..! వెనక్కి తగ్గే వరకు పోరాడుతాం: సీపీఎం

Last Updated : Oct 23, 2023, 7:48 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.