ETV Bharat / state

'హైకోర్టు నోటీసులిచ్చిన వారందరికీ అండగా ఉంటాం' - నిమ్మగడ్డ వివాదం వార్తలు

వైకాపా కార్యకర్తలకు న్యాయవ్యవస్థను కించపరిచే ఉద్దేశం లేదని ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. న్యాయమూర్తులకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టినందుకు హైకోర్టు నుంచి నోటీసులందుకున్న వారందరికీ అండగా ఉంటామని ఆయన అన్నారు. గత ఐదు సంవత్సరాలుగా ఇలాంటి కేసులే తెదేపా కార్యకర్తలపై పెడితే రాష్ట్రంలోని జైళ్లు సరిపోవని వ్యాఖ్యానించారు.

vijay sai reddy
vijay sai reddy
author img

By

Published : Jun 1, 2020, 3:57 PM IST

Updated : Jul 27, 2020, 12:07 PM IST

'హైకోర్టు నోటీసులిచ్చిన వారందరికీ అండగా ఉంటాం'

న్యాయమూర్తులను కించపరిచేలా సోషల్​ మీడియాలో పోస్టులు పెట్టినందుకు హైకోర్టు నుంచి నోటీసులందుకున్న వారందరికీ అండగా ఉంటామని వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. కేసుల్లో ఇరుక్కున్నంత మాత్రాన కార్యకర్తలను వదులుకునేది లేదని స్పష్టం చేశారు. తెదేపా కార్యకర్తల కవ్వింపులతోనే వైకాపా ప్రభుత్వ సానుభూతిపరులు అలాంటి పోస్టులు పెట్టారని ఆయన అన్నారు. అంతేకానీ న్యాయవ్యవస్థను కించపరిచే ఉద్దేశం ఏ ఒక్క వైకాపా కార్యకర్తకు లేదని చెప్పారు.

వైకాపా సోషల్ మీడియా విభాగాన్ని తానే చూసుకుంటున్నానని తెలిపారు. గత ఐదు సంవత్సరాలుగా ఇలాంటి కేసులే తెదేపా కార్యకర్తలపై పెడితే రాష్ట్రంలోని జైళ్లు సరిపోవని అన్నారు. మరోవైపు తన పేరు మీద ఫేక్ అకౌంట్స్ పెట్టి.. కొందరు సీఎం జగన్​ను దూషించిన పోస్టులు పెట్టారని విజయసాయిరెడ్డి తెలిపారు. వారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు.

ఎస్​ఈసీ నిమ్మగడ్డ విషయంలోనూ విజయసాయిరెడ్డి స్పందించారు. నిమ్మగడ్డ విషయం ప్రజాస్వామ్య వ్యవస్థకు గొడ్డలిపెట్టని వ్యాఖ్యానించారు. ఎస్‌ఈసీ తీర్పు అంశంపై సుప్రీంకోర్టుకు వెళ్తున్నామని తెలిపారు. నిమ్మగడ్డ ఎస్‌ఈసీగా ఉండాలని తెదేపా ఎందుకు కోరిందని.... హైకోర్టు తీర్పు వచ్చాక తెదేపా ఎందుకు సంబరాలు చేసుకుందని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.

ఇదీ చదవండి

అభ్యంతరకర వ్యాఖ్యలపై హైకోర్టు ఆగ్రహం..49 మందికి ధిక్కరణ నోటీసులు

Last Updated : Jul 27, 2020, 12:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.