వైద్యుడు సుధాకర్‌కు సరైన వైద్య సదుపాయం అందడంలేదని ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ మానసిక వైద్యశాల సూపరింటెండెంట్‌కు సుధాకర్ రాసిన లేఖపై వారు స్పందించారు. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తిపై మానసిక రోగి అని ముద్ర వేసి ఉద్దేశపూర్వకంగా దుష్ప్రభావం చూపించే మందులు ఇస్తున్నారని చెప్పారు. ఆసుపత్రిలో సుధాకర్‌కి చికిత్స అందిస్తున్న వైద్యుడిని వివరాలు అడిగినప్పటికీ తమకు ఏ విధమైన సమాధానం రావడం లేదన్నారు. సుధాకర్‌ను వేరొక ఆసుపత్రికి పంపించే దిశగా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. సుధాకర్ విషయంలో పూర్తి స్థాయిలో న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని ఆయన తల్లి కావేరిబాయి స్పష్టం చేశారు.
'సుధాకర్‌కు అందిస్తున్న చికిత్సపై అనుమానాలున్నాయి'
వైద్యుడు సుధాకర్‌కు అందిస్తున్న చికిత్సపై తమకు అనుమానాలున్నాయని ఆయన కుటుంబ సభ్యులు పేర్కౌన్నారు. కావాలనే దుష్ప్రభావం చూపించే మందులు ఇస్తున్నారని ఆరోపించారు. సుధాకర్‌ను వేరొక ఆసుపత్రికి పంపించాలని కోరారు.