విశాఖ జిల్లా అనకాపల్లి మండలం పాపయ్యపాలెంలో ఆందోళన నెలకొంది. ఈ గ్రామంలో 127 మంది రైతుల నుంచి 137.26 ఎకరాల డి- ఫారం పట్టా, ఆక్రమిత భూములను భూసేకరణ కింద తీసుకోవడానికి అనకాపల్లి ఆర్టీవో సీతారామారావు, తహసీల్దార్ ప్రసాదరావు, వీఎంఆర్డీఏ అధికారులు గ్రామసభ నిర్వహించారు. భూసేకరణ కింద భూమి తీసుకుని అభివృద్ధి చేసి పేదలకు ఇళ్లస్థలాలు ఇస్తామని అధికారులు వివరించారు. అయితే భూములను ఎకరాల చొప్పున తీసుకుని గజాల చొప్పున తిరిగి ఇస్తే తమకు ఏం ప్రయోజనం ఉంటుందని రైతులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. అంతేకాకుండా భూ సర్వే పేరుతో తమ నుంచి అధికారులు అక్రమంగా సంతకాలు తీసుకున్నారని మండిపడ్డారు. తమ భూములను ప్రభుత్వానికి ఇచ్చేది లేదంటూ రైతులు స్పష్టం చేశారు. జిల్లాలో వందల ఎకరాల్లో భూమి కబ్జా పాలైందని ఆ వివరాలను తాము ఇస్తామని అధికారులకు రైతులు వెల్లడించారు. చేతనైతే వాటిని స్వాధీనం చేసుకోవాలని సూచించారు. అనకాపల్లి ఆర్టీవో సీతారామారావు వాహనానికి అడ్డంగా నిలబడి తమ వద్ద తీసుకున్న పత్రాలను తిరిగిచ్చేయాలని డిమాండ్ చేశారు. కొంతమంది మహిళా రైతులు వాహనానికి అడ్డంగా కూర్చుని భూములను ఇచ్చేది లేదంటూ నినాదాలు చేశారు.
మా భూములిచ్చే ప్రసక్తే లేదు : రైతులు - విశాఖ జిల్లా తాజా వార్తలు
విశాఖ జిల్లాలో భూసేకరణకు ప్రజల నుంచి వ్యతిరేకత వస్తోంది. తమ భూములను ఎట్టిపరిస్థితుల్లోనూ ఇవ్వమని రైతులు తేల్చిచెబుతున్నారు. వందల ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాకు గురైందని... చేతనైతే వాటిని స్వాధీనం చేసుకోవాలని సూచిస్తున్నారు. వాటికి సంబంధించిన వివరాలను తామే ఇస్తామని చెప్పారు. భూ సర్వే పేరుతో అధికారులు తమ సంతకాలు తీసుకున్నారని ఆరోపిస్తున్నారు.
విశాఖ జిల్లా అనకాపల్లి మండలం పాపయ్యపాలెంలో ఆందోళన నెలకొంది. ఈ గ్రామంలో 127 మంది రైతుల నుంచి 137.26 ఎకరాల డి- ఫారం పట్టా, ఆక్రమిత భూములను భూసేకరణ కింద తీసుకోవడానికి అనకాపల్లి ఆర్టీవో సీతారామారావు, తహసీల్దార్ ప్రసాదరావు, వీఎంఆర్డీఏ అధికారులు గ్రామసభ నిర్వహించారు. భూసేకరణ కింద భూమి తీసుకుని అభివృద్ధి చేసి పేదలకు ఇళ్లస్థలాలు ఇస్తామని అధికారులు వివరించారు. అయితే భూములను ఎకరాల చొప్పున తీసుకుని గజాల చొప్పున తిరిగి ఇస్తే తమకు ఏం ప్రయోజనం ఉంటుందని రైతులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. అంతేకాకుండా భూ సర్వే పేరుతో తమ నుంచి అధికారులు అక్రమంగా సంతకాలు తీసుకున్నారని మండిపడ్డారు. తమ భూములను ప్రభుత్వానికి ఇచ్చేది లేదంటూ రైతులు స్పష్టం చేశారు. జిల్లాలో వందల ఎకరాల్లో భూమి కబ్జా పాలైందని ఆ వివరాలను తాము ఇస్తామని అధికారులకు రైతులు వెల్లడించారు. చేతనైతే వాటిని స్వాధీనం చేసుకోవాలని సూచించారు. అనకాపల్లి ఆర్టీవో సీతారామారావు వాహనానికి అడ్డంగా నిలబడి తమ వద్ద తీసుకున్న పత్రాలను తిరిగిచ్చేయాలని డిమాండ్ చేశారు. కొంతమంది మహిళా రైతులు వాహనానికి అడ్డంగా కూర్చుని భూములను ఇచ్చేది లేదంటూ నినాదాలు చేశారు.
ఇదీ చదవండి
అమరావతి కోసం ఆగిన మరో గుండె