విశాఖ జిల్లా మాడుగుల మండలం పెద్దేరు, దేవరాపల్లి మండలం రైవాడ జలాశయాల్లో నీటిమట్టం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ప్రస్తుతం పెద్దేరు జలాశయం నీటిమట్టం 135.35 మీటర్లు కాగా.. ఎగువ నుంచి 645 క్యూసెక్కుల నీరు వచ్చిచేరుతోంది. దీంతో జలాశయం గేట్లు ఎత్తి 510 క్యూసెక్కుల నీటిని పెద్దేరు నదిలోకి విడిచి పెడుతున్నారు. ప్రస్తుతం రైవాడ జలాశయ నీటిమట్టం 113.30 మీటర్లు ఉండగా.. ఎగువ నుంచి 895 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. జలాశయం గేట్లు ఎత్తి 375 క్యూసెక్కుల వరదనీరు దిగువన శారదా నదిలోకి కొద్ది రోజులుగా కొనసాగుతున్నట్లు అధికారులు చెప్పారు.
ఇదీ చదవండి: 'పెయిడ్ ఆర్టిస్టుల నుంచి తప్ప మరెక్కడా స్పందన లేదు'