ETV Bharat / state

సారూ.. మంచినీళ్లూ...! - మధ్యాహ్న భోజనం

తాగడానికి మంచినీళ్లు లేవు. తిన్న కంచాలు కడుగుదామన్నా.. అల్లంత దూరం వెళ్లాలి. మరుగుదొడ్లూ లేవు. అదేమంటే.. ఉన్నతాధికారులకు చెప్పాం.. పరిష్కరిస్తాం అంటారు. కానీ.. ఇన్ని సమస్యలు ఎన్నడు తీరుతాయో తెలియదు. విశాఖ జిల్లా బుచ్చెంపేట పాఠశాలలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలివి.

water problem in school
author img

By

Published : Jul 21, 2019, 4:56 AM IST

Updated : Jul 21, 2019, 6:58 AM IST

సారూ.. మంచినీళ్లూ...!

విశాఖ జిల్లా రోలుగుంట మండలం బుచ్చెంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో.. సమస్యలు రాజ్యమేలుతున్నాయి. మంచినీటి వసతి సరిగా లేక.. విద్యార్థులు దాహంతో అలమటిస్తున్నారు. మరుగుదొడ్లు లేని కారణంగా.. విద్యార్థినులు ఇబ్బందిపడుతున్నారు. ఈ పాఠశాలలో 279 మంది చదువుకుంటున్నారు. వీరి సౌకర్యార్థం పాఠశాలలో ఏర్పాటు చేసిన బోరు.. రెండేళ్ల క్రితమే చెడిపోయింది. నాటి నుంచే స్కూల్ లో నీటి కష్టాలు మొదలయ్యాయి. మధ్యాహ్న భోజన అనంతరం కంచాలు శుభ్రం చేసుకునేందుకు.. సమీపంలోని రావణపెళ్లి జలాశయంలో చేరిన కాస్తంత వరద నీటిని వాడుకుంటున్నారు. ఈ మధ్యే తవ్విన నీటి కుంటల్లో దిగి.. ఎంగిలి ప్లేట్లు శుభ్రం చేసుకుంటున్నారు. అంతేకాదు.. ఇక్కడ.. మధ్యాహ్నభోజన నాణ్యతా అంతంతమాత్రమే. ఉడికీ ఉడకని అన్నం, సరిగా అందని గుడ్లు.. ఇలా.. చెబుతూ పోతే చాలానే ఉన్నాయి. ఇది తట్టుకోలేని కొందరు పిల్లలు.. ఇంటినుంచి క్యారేజ్ లు తెచ్చుకుంటున్నారు. స్కూలు హెడ్ మాస్టరు మాత్రం.. డీఈవోతో సమస్య గురించి మాట్లాడామని.. త్వరలోనే పరిష్కిరిస్తామనీ చెప్పారు.

Intro:విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గంలో లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. వరి నారుమడులు ఎండి పోవడమే కాకుండా కూరగాయల పంటలకు అపార నష్టం వాటిల్లుతుంది. జిల్లాలో లో రామ భద్ర పురం మండలం లో కూరగాయల తోటలకు ప్రసిద్ధి. చిన్న చిన్న కమతాల్లో పలు రకాల పంటలు వేసుకొని రైతులు జీవనం సాగిస్తున్నారు. వర్షాలు లేకపోవడంతో వారి పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా మారింది

Body:గతంలో ఎన్నడూ లేనివిధంగా బావులు చెఱువులు నీటి కుంటలు ఎండిపోయినా తో పంటలు తడుపుకోవడానికి కూడా చుక్క నీరు లేక రైతులు అల్లాడిపోతున్నారు. దూర ప్రాంతాల నుంచి నీటిని తెచ్చుకుని పంటలను తడుపుకుని ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఎండలతో పంటలు ఎండిపోతున్నాయి .ముఖ్యంగా రామభద్రపురం మండలంలోని రైతులు తీవ్ర కరువు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు.

Conclusion:చాలామంది కూరగాయ రైతులు పెట్టుబడులు పెట్టి పండించిన టమాటో, బెండ, బీర ,కాకర వంటి పంటలు ఎండిపోవడంతో అలానే వదిలేశారు. మరికొన్ని గ్రామాల్లో వరి నారు మడులు తడుపుకుని కునేందుకు కూడా రైతులు దూర ప్రాంతాల నుంచి నీటిని తెచ్చుకుంటున్నారు. అంతేకాకుండా దూర ప్రాంతాల నుంచి తెచ్చిన నీరు వృధా కాకుండా మొక్కలు పై కాగితాలు ఎండు గడ్డి వేసి వాటిపై నీళ్లు చిలకరిస్తూ ఉన్నారు .దీనివలన నీటితో ఎక్కువ సేపు ఉంటాయని రైతులు భావిస్తున్నారు .ఎక్కడా లేని విధంగా రైతులు ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని అనుసరించి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. చల్లిన విత్తనాలపై నేరుగా సూర్యరశ్మి పడకుండా ఇలా కాగితాలు అడ్డువేసి విత్తనాలు మొలకెత్తే విధంగా రైతులు ప్రయత్నాలు సాగిస్తున్నారు. మరికొంతమంది రైతులు ఎండు గడ్డి వేసి నీటిని చిలక ఇస్తున్నారు .ఇలా అయితే విత్తనాలు మొలక ఎత్తు తాయని రైతుల ఆశ.
Last Updated : Jul 21, 2019, 6:58 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.