విశాఖ జిల్లా మాడుగుల మండలంలోని పెద్దేరు జలాశయంలో నీటిమట్టం గరిష్ఠ స్థాయికి చేరుకుంది. వర్షాలు తగ్గినా ఎగువ ప్రాంతం నుంచి జలాశయంలోకి వరద వచ్చి చేరుతుండటంతో నీటిమట్టం పెరిగింది. ప్రస్తుతం జలాశయానికి ఇన్ ఫ్లో 90 క్యూసెక్కుల మేర ఉంది. జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 137 మీటర్లు కాగా... ప్రస్తుతం 136.35 మీటర్ల వరకు నీరు ఉంది.
ఆయకట్టు ప్రాంతంలోని రాచకట్టు, ఆర్ఎంసీ కాలువలకు 90 క్యూసెక్కుల సాగునీటిని విడుదల చేస్తున్నట్లు జలవనరుల శాఖ సుధాకర్ రెడ్డి చెప్పారు. జలాశయం నీటిమట్టం భారీగా పెరగటంతో జలవనరుల శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. నిరంతరం జలాశయాన్ని పర్యవేక్షిస్తున్నారు. నీటిమట్టం పెరిగితే దిగువకు నీటిని విడుదల చేసే అవకాశం ఉందని చెప్పారు. నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు.
ఇదీ చదవండి