విశాఖ జిల్లా భీమిలి జోన్ పరిధిలో పలు వార్డుల్లో జీవీఎంసీ కమిషనర్ హరినారాయణ ఆదేశాల మేరకు దోమలపై దండయాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. మలేరియా, డెంగ్యూ, తదితర జ్వరాలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులు ప్రజలకు అవగాహన కల్పించారు. ఇంటింటికి వెళ్లి దోమల నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో వివరించారు. నీరు నిల్వ ఉండకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తపడాలని సూచించారు. కార్యక్రమంలో భీమిలి ప్రత్యేక అధికారి బి.సన్యాసినాయుడు, జోనల్ కమిషనర్ రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
ఇదీచదవండి