ఫ్రెండ్స్ హెల్త్ క్లబ్ 2020-2022 నూతన కార్యవర్గ ఎన్నికలు నిర్వహించారు. అధ్యక్షుడిగా వస్త్ర వ్యాపారి పసుమర్తి శేష కామయ్య గుప్తా, ప్రధాన కార్యదర్శిగా జీవిత బీమా డెవలప్మెంట్ సంస్థ విశ్రాంత అధికారి పి.రాధాకృష్ణ, కోశాధికారిగా విశ్రాంత ఉపాధ్యాయులు చినబాబును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పూర్వపు అధ్యక్షుడు చిరికి దేవానంద్ అధ్యక్షతన జరిగిన ఈ ఎన్నికలకు.. జలవనరుల శాఖ విశ్రాంత గణాంక అధికారి కోకా రాంబాబు, విశ్రాంత పోలీస్ ఇన్ స్పెక్టరు యు.వి.సూర్యనారాయణ, సామాజిక కార్యకర్త ఆలమండ బంగారయ్య పరిశీలకులుగా వ్యవహరించారు.
గ్రామీణ జిల్లాలో వాకర్స్ సంఘానికి పక్కా భవనం ఉన్నది ఒక్క చోడరంలోనేనని సభ్యులు కొనియాడారు. అరోగ్య, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, యోగ వంటివి నిత్య కార్యకలాపాలుగా క్లబ్ లో జరగాలని పలువురు సభ్యులు సూచించారు. ఎన్నికైన సభ్యులచే విశ్రాంత ఉపాధ్యాయులు పి.రాజశేఖర్, కె.సుబ్రహ్మణ్యం ప్రతిజ్ఞ చేయించారు.
ఇవీ చూడండి: