ETV Bharat / state

విశాఖ ‘వ్యాగన్‌ వర్క్‌షాప్‌’ రెడీ!

విశాఖ శివారు వడ్లపూడిలో వ్యాగన్‌ పీరియాడిక్‌ ఓవర్‌హాల్‌ (పీవోహెచ్‌) వర్క్‌షాప్ నిర్మాణం పూర్తైంది. ప్రస్తుతం రైల్వే ట్రయల్‌రన్‌ నిర్వహిస్తోంది. సిబ్బందిని సమకూర్చుకునేందుకు మరో 6 మాసాలు పట్టనుంది. దక్షిణకోస్తా రైల్వేజోన్‌కు మరింత కలిసొచ్చేలా ప్రాజెక్ట్ నిర్మాణం జరిగింది.

Wagon Periodic Overhaul construction ready at vishaka
వ్యాగన్‌ పీరియాడిక్‌ ఓవర్‌హాల్
author img

By

Published : Dec 16, 2020, 10:42 AM IST

విశాఖ వ్యాగన్‌ వర్క్‌షాప్

విశాఖ శివారు వడ్లపూడిలో భారతీయరైల్వే తెచ్చిన ‘వ్యాగన్‌ పీరియాడిక్‌ ఓవర్‌హాల్‌ (పీవోహెచ్‌) వర్క్‌షాప్‌’ నిర్మాణాలు పూర్తయ్యాయి. ఇప్పుడు ప్రారంభానికి సిద్ధమైంది. 2019 నవంబరుకే పనులు పూర్తికావాల్సి ఉండగా సాంకేతక ఇబ్బందులు, కొవిడ్‌ కారణంగా పనులు ఆలస్యమయ్యాయి. సుమారు రూ.260కోట్లతో రైల్వేఅనుబంధ సంస్థ ఆర్‌వీఎన్‌ఎల్‌ ఈ ప్రాజెక్టు నిర్మాణాల్ని పూర్తిచేసి ఈనెల 12న రైల్వేఅధికారులకు అప్పగించారు. అవసరమైన అధునాతన యంత్రాలు, సాంకేతికత సిద్ధంచేసి ఉంచారు. ప్రస్తుతం ట్రయల్‌రన్‌ నిర్వహిస్తున్నారు. వర్క్‌షాప్‌కు కేటాయించిన గూడ్స్‌వ్యాగన్లను కొంతమంది సిబ్బందితో పూర్తిస్థాయిలో ఓవర్‌హాలింగ్‌ చేస్తున్నారు.

Wagon Periodic Overhaul construction ready at vishaka
వ్యాగన్‌ పీరియాడిక్‌ ఓవర్‌హాల్

2వేలమంది కార్మికులు

నెలకు 200 వ్యాగన్లను పూర్తిస్థాయిలో ఇక్కడ ఓవర్‌హాలింగ్‌ చేయనున్నారు. చుట్టుపక్కల రైల్వేడివిజన్ల నుంచి వ్యాగన్లు వచ్చే అవకాశముంది. శాశ్వత, తాత్కాలిక కార్మికులంతా కలిసి సుమారు 2వేలమందిదాకా వర్క్‌షాప్‌లో పనిచేసేందుకు అవసరమని రైల్వే అధికారుల అంచనాలు. ప్రస్తుతం ఓ ఏజెన్సీ సాయంతో కొంతమంది సిబ్బందిని తీసుకుని ప్రారంభోత్సవానికి వెళ్లాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ తంతు పూర్తయ్యేందుకు మరో 5, 6మాసాల సమయం పడుతుందని భావిస్తున్నారు. పైస్థాయి, కిందిస్థాయి అధికారులందరికీ 64క్వార్టర్లని, పరిపాలనా భవానాన్ని, క్యాంటీన్‌ను సిద్ధంచేసి ఉంచారు.

  • బడ్జెట్‌ ప్రకటన - 2014-15
  • నిధుల మంజూరు - 2015-16
  • ప్రాజెక్టు వ్యయం - రూ.260కోట్లు
  • విస్తీర్ణం - 200ఎకరాలు
  • నిర్వాహణ సామర్థ్యం - నెలకు 200 వ్యాగన్లు

    విశాఖ ‘వ్యాగన్‌ వర్క్‌షాప్‌’

సాంకేతికతకే పెద్దపీట

దేశంలో ఇప్పుడున్న సాంకేతికలో అత్యున్నత సాంకేతికతతో వ్యాగన్‌ పీవోహెచ్‌ వర్క్‌షాప్‌ను అందుబాటులోకి తెస్తున్నారు. చాలావరకు పనులు ఆటోమేటిక్‌గా జరిగిపోయేలా డిజైన్‌చేశారు.

  • వ్యాగన్‌ నుంచి పైనున్న డబ్బా, కిందనున్న చక్రాల్ని వేరుచేయడం, కొత్త రైలుచక్రాల్ని మలచడం, విడిభాగాల్ని బిగించడం లాంటిపనుల్ని చేసేందుకు యంత్రాల్ని తెచ్చారు.
  • ఏ విడిభాగం కావాలన్నా.. ఆన్‌లైన్లో ఇండెంట్‌ పెట్టగానే వాటిని సిద్ధంచేసేలా ఆటోమేటెడ్‌ స్టోరేజీ రిట్రైవల్‌ సిస్టం (ఏఎస్‌ఆర్‌ఎస్‌) వ్యవస్థను అందుబాటులోకి తెచ్చారు. ఈ విడిభాగాల నిల్వకోసం ప్రత్యేక గోదామును అత్యాధునికంగా మలిచారు.
  • వ్యాగన్లను పూర్తిస్థాయిలో మరమ్మతుచేసే విభాగాలతో పాటు, కడగటం, రంగులు వేయడం, ఆ తర్వాత రంగుల్ని నిమిషాల్లో ఆరబెట్టే యంత్రాలు.. ఇలా సుమారు 12రకాల విభాగాల్ని అందుబాటులోకి తెచ్చారు.
  • వర్క్‌షాప్‌ ఆవరణలో ఏకకాలంలో 800 వ్యాగన్లను నిల్వఉంచుకునే సామర్థ్యంతో పట్టాలు వేసిఉంచారు. ఈ సామర్థ్యాన్ని మరింత పెంచుకునేందుకు అనువైన స్థలమూ ఉంది. దక్షిణకోస్తా రైల్వేజోన్‌ త్వరలో అందుబాటులోకి రానుందంటున్న నేపథ్యంలో ఈ ప్రాజెక్టు అతికీలకంగా మారింది. ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా సరకు రవాణాని మరింత వేగవంతం చేసేందుకు ఇది అదనపు హంగు అవనుంది.

ఇదీ చదవండి:

జస్టిస్‌ రాకేశ్‌కుమార్‌పై ప్రభుత్వం అఫిడవిట్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.