విశాఖపట్నం జిల్లా చీడికాడ మండలం వెలుగు గ్రామంలో ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడికి వీఓఏలు సన్మానం చేశారు. వీఓఏలకు రూ.10వేలు వేతనం ఇటీవల కొన్ని నెలలుగా ప్రభుత్వం అమలు చేస్తున్న నేపథ్యంలో వారంతా ఎమ్మెల్యేను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మహిళా సంఘాల అభ్యున్నతికి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు వారికి అందేలా కృషి చేయాలని సూచించారు. వైకాపా మండల అధ్యక్షుడు అప్పారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇవీ చూడండి:కొవిడ్ బాధితులతో మాట్లాడిన మంత్రి ఆళ్ల నాని.. సౌకర్యాలపై ఆరా