ETV Bharat / state

విజయనగరం రైలు ప్రమాదంలో మరో మహిళ మృతి 14కు చేరిన మృతుల సంఖ్య - Andhra Pradesh Train Accident

Vizianagaram Train Accident Death Toll: విజయనగరం జిల్లాలో చోటుచేసుకున్న రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 14కు చేరింది. అనకాపల్లి జిల్లా పరవాడ మండలం వాడచీపురుపల్లికి చెందిన ఎం.లక్ష్మి.. రైలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతిచెందింది.

Vizianagaram_Train_Accident_Death_Toll
Vizianagaram_Train_Accident_Death_Toll
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 2, 2023, 1:06 PM IST

Vizianagaram Train Accident Death Toll: విజయనగరం రైలు ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 14కు చేరింది. అనకాపల్లి జిల్లా పరవాడ మండలం వాడచీపురుపల్లికి చెందిన ఎం.లక్ష్మి కేజీహెచ్​లో చికిత్స పొందుతూ మరణించారు. రైలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ లక్ష్మికి అంతర్గత అవయవాలన్నీ దెబ్బతినటంతో కేజీహెచ్‌లో శస్త్ర చికిత్స నిర్వహించారు. ప్రమాదంలో ఆమె పక్కటెముకలు, ఊపిరితిత్తుల ఎముకలు ఛిద్రం అయిపోయాయి. చికిత్స పొందుతూ ఆమె కేజీహెచ్​లో కన్నుమూశారు.

Vizianagaram Train Accident: విజయనగరం జిల్లాలో చోటుచేసుకున్న ఘోర రైలు ప్రమాదం వందలాది మంది పేద కుటుంబాల్లో చీకట్లు నింపింది. పనులు పూర్తి చేసుకుని త్వరగా ఇంటికి చేరుకుందామనుకున్న బడుగుల బతుకులు ఛిద్రమయ్యాయి. చిమ్మ చీకట్లో ఏం జరిగిందో తెలిసేలోపే పలువురి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. యుద్ధప్రాతిపదికన సహాయ చర్యలు ప్రారంభించిన రైల్వే సిబ్బంది.. మృతదేహాలను వెలికితీసి.. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. దెబ్బతిన్న బోగీలను తొలగించి 19 గంటల్లోనే ట్రాక్‌ పునరుద్ధరించారు.

Vizianagaram Train Accident Reasons: విజయనగరం జిల్లా రైలు ప్రమాదంపై అనేక సందేహాలు.. కారణాలు ఏంటి..?

నిరంతరాయంగా శ్రమించిన సహాయక బృందాలు: రైలు ప్రమాద ఘటనలో యుద్ధప్రాతిపదికన చర్యలు మొదలుపెట్టి.. సహాయక బృందాలు నిరంతరాయంగా శ్రమించాయి. ఒకదానిపైకి ఒకటి పడిపోయిన రైళ్ల బోగీలను పక్కకు తొలగించారు. విశాఖ నుంచి తరలించిన బాహుబలి క్రేన్‌తో బోగీలను పక్కకు జరిపారు. బోగీల్లో ఇరుక్కుపోయిన మృతదేహాలను వెలికితీయడంతోపాటు.. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు.

Andhra Pradesh Train Accident 2023: విజయనగరం జిల్లా కంటకాపల్లె - ఆలమండ స్టేషన్ల మధ్య సిగ్నల్ కోసం వేచి ఉన్న విశాఖపట్నం-పలాస ప్యాసింజర్‌ను.. విశాఖ - రాయగడ్ ప్యాసింజర్ రైలు వెనక నుంచి ఢీకొనడంతో రెండు రైళ్ల బోగీలు పక్కనే ఉన్న గూడ్స్‌ రైలుపైకి అవి దూసుకెళ్లాయి. మొత్తం 7 బోగీలు నుజ్జునుజ్జవ్వడంతో.. అందులో చిక్కుకున్న ప్రయాణికుల మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా మారిపోయాయి. చిమ్మచీకట్లో ప్రయాణికుల హాహాకారాలతో ఆ ప్రాంతమంతా మార్మోగింది. మృతులు, క్షతగాత్రుల రక్తం, శరీర భాగాలతో ఆ ప్రాంతమంతా భీతావహంగా మారింది.

CM Jagan Tweet on Train Accident Incident: రైలు ప్రమాద ఘటన.. పలు సందేహాలు లేవనెత్తుతోంది: సీఎం జగన్​

ఈ ఏడాది జూన్‌లో జరిగిన బాలేశ్వర్‌ రైలు ప్రమాద ఘటన మాదిరిగానే తాజాగా జరిగిన ప్యాసింజర్‌ రైళ్ల ప్రమాదం కూడా చోటు చేసుకుంది. పలాస గార్డు బోగీని రాయగడ ఇంజిన్ ఢీకొట్టడంతో ఆ రెండు నుజ్జయ్యాయి. ఈ వేగానికి రాయగడ ట్రైన్ బోగీలు ఏకంగా అదే రైలు ఇంజినుపైకి దూసుకెళ్లాయి.

10 లక్షల రూపాయల పరిహారం: ఈ ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలకు 10 లక్షల రూపాయల పరిహారాన్ని రైల్వేశాఖ ప్రకటించింది. తీవ్రంగా గాయపడిన వారికి 2 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి 50 వేల రూపాయల చొప్పున పరిహారం ఇస్తున్నట్లు పేర్కొంది. మృతుల కుటుంబాలకు ప్రధాని రెండు లక్షల రూపాయల సాయం ప్రకటించారు. క్షతగాత్రులకు 50వేల రూపాయలు ఇవ్వనున్నారు. ప్రమాద మృతుల్లో ఆంధ్రప్రదేశ్​కు చెందినవారి కుటుంబాలకు 10 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి 2 లక్షల చొప్పున పరిహారాన్ని సీఎం జగన్‌ ప్రకటించారు.

Andhra Pradesh Train Accident: రైలు ప్రమాదం.. 19 గంటల్లో ట్రాక్​ పునరుద్ధరణ.. కొనసాగుతున్న రాకపోకలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.