విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం సబ్‌స్టేషన్ కార్యాలయాన్ని జిల్లా పర్యవేక్షక ఇంజినీర్ ఆపరేషన్స్ విభాగం ఏవీవీ సూర్యప్రతాప్ సందర్శించారు. డివిజన్ పరిధిలో ఏపీఈపీడీసీఎల్ చేపడుతున్న అభివృద్ధి పనులను పర్యవేక్షించారు. అధికారులు, సిబ్బందితో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
విద్యుత్ సరఫరాలో ఎదురయ్యే అంతరాయాలను తగ్గించి, నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మరమ్మతులకు ఆరు కోట్ల రూపాయలతో సమగ్ర ప్రాజెక్టు నివేదికను తయారు చేయాలని సూచించారు. పెరుగుతున్న విద్యుత్ వినియోగానికి అనుగుణంగా నూతన సబ్స్టేషన్లను నిర్మించాలని కోరారు.
ఇదీచదవండి.