విశాఖ జిల్లా యలమంచిలిలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. కౌంటింగ్ సిబ్బంది బ్యాలెట్ బాక్సులు తెరిచి చూడగా అందులో 'విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు' నినాదాలు రాసిన పత్రాలు కనిపించాయి. దీంతో బ్యాలెట్ పత్రాల నుంచి ఆ పేపర్లను సిబ్బంది వేరు చేస్తున్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను నిరసిస్తూ గత కొన్ని రోజులుగా ఆందోళనలు సాగుతున్నాయి.
ఇదీ చదవండి: మున్సిపల్ ఎన్నికల్లో.. విజేతలు వీరే..!